మోదీ పాదాలను తాకి.. రాష్ట్ర ప్రజలను అవమానించారు

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మోదీ పాదాలను తాకి రాష్ట్రాన్ని అవమానించారని.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు.

By M.S.R  Published on  15 Jun 2024 8:15 PM IST
prashant Kishore,  bihar cm nitish,   pm modi,

మోదీ పాదాలను తాకి.. రాష్ట్ర ప్రజలను అవమానించారు

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మోదీ పాదాలను తాకి రాష్ట్రాన్ని అవమానించారని.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. భాగల్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. అధికారంలో కొనసాగడం కోసం నితీష్ కుమార్ అలా చేశారని ఆరోపించారు. ప్రధాని ప్రమాణ స్వీకారానికి ముందు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నితీశ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకడాన్ని ప్రస్తావిస్తూ ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఆయనతో కలిసి పనిచేసిన నేను ఇప్పుడు నితీష్ కుమార్‌ను ఎందుకు విమర్శిస్తున్నావని ప్రజలు తనను అడుగుతున్నారన్నారు ప్రశాంత్ కిషోర్. అప్పుడు ఆయన వేరే వ్యక్తని.. ఇప్పడు మారిపోయారన్నారు. ఆ సమయంలో ఆయన తన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఒక రాష్ట్రానికి నాయకుడు అంటే ఆ ప్రాంత ప్రజలకు గర్వకారణం.. కానీ నితీష్ కుమార్ మోదీ పాదాలను తాకి బీహార్‌ ను అవమానించారని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

Next Story