సిమ్ డీలర్లకు కొత్త రూల్స్.. పోలీస్ వెరిఫికేషన్ మస్ట్
సిమ్ కార్డులతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 7:06 PM ISTసిమ్ డీలర్లకు కొత్త రూల్స్.. పోలీస్ వెరిఫికేషన్ మస్ట్
సిమ్ కార్డులతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిరి చేసింది. అంతేకాక బల్క్ కనెక్షన్లను కూడా నిలివేస్తున్నట్లు ప్రకటించింది.
మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపివేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సైబర్ నేరాలు, మోసపూరిత ఫోన్ కాల్స్ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సిమ్ డీలర్లందరికీ పోలీస్ వెరిఫికేషన్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పని సరి అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు కూడా ఉంటాయని తెలిపారు. రూ.10 లక్షల జరిమానా విధిస్తామని ప్రకటించారు. సంచార్ సాథి పోర్టల్‌ను ప్రారంభించినప్పటి నుంచి సమారు 52 లక్షల మోసపూరిత కనెక్షన్లను ప్రబుత్వం గుర్తించింది. ఆ తర్వాత వాటిని డీయాక్టివేట్ చేసినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ క్రమంలోనే కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లు ఆయన ప్రకటించారు.
సిమ్ డీలర్లు అక్రమ మార్గాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా సిమ్ కార్డులను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఇక నుండి అలాంటివి ఉండవన్నారు అశ్విని వైష్ణవ్. సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. వెరిఫికేషన్ తర్వాత వారు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. మొబైల్ సిమ్ కార్డులను విక్రయిస్తున్న 67వేల మంది డీలర్లను ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్ చేసిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 2023 మే నుంచి 300 మంది సిమ్‌కార్డు డీలర్లపై ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేశామని అన్నారు. అయితే.. గతంలో ప్రజలు కూడా సిమ్ కార్డులు ఎక్కువ సంఖ్యలో కొన్నారని.. ఆ విధానానికి కూడా స్వస్తి పలకాలని అశ్విని వైష్ణవ్ అన్నారు. మోసపూరిత కాల్స్‌ను ఆపడంలో సహాయపడే సరైన బిజినెస్ కనెక్షన్ నిబంధనను తీసుకొస్తామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.
అయితే.. దేశంలో 10 లక్షల మంది సిమ్ డీలర్లు ఉన్నారని.. వారందరూ పోలీస్ వెరిఫికేషన్ చేసుకునేందుకు తగినంత సమయం ఇస్తామని అన్నారు. బల్క్ కనెక్షన్ల సదుపాయం నిలిపివేసిన క్రమంలో.. బిజినెస్ కనెక్షన్ అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. మోసపూరిత కాల్స్ అస్సలు ఉండొద్దని.. ప్రజల సంక్షేమం కోసమే కేంద్రం కొత్త నిర్ణయాలు తీసుకుంటుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.