జిమ్ చేస్తూ హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన డీఎస్పీ
ఓ పోలీసు ఉన్నతాధికారి జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తూ హార్ట్ ఎటాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 23 Oct 2023 1:00 PM GMTజిమ్ చేస్తూ హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన డీఎస్పీ
ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు. పది పన్నెండేళ్ల వయసు ఉన్న పిల్లలకు కూడా గుండెపోటు రావడం కలవరం సృష్టిస్తోంది. అంతేకాదు.. ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉన్నవారు కూడా గుండెపోటుకు గురై ఉన్నచోటే కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. హార్ట్ ఎటాక్‌కు గురైన సమయంలో అక్కడే ఎవరై నిపుణులు ఉండి సీపీఆర్ చేస్తే మాత్రం బతికే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సంఘటనలూ మనం చూశాం. అయితే.. తాజాగా ఓ పోలీసు ఉన్నతాధికారి జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తూ హార్ట్ ఎటాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు.
హర్యానాలోని పానిపట్ జిల్లా జైల్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా జోగిందర్ దేశ్వాల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం ఉదయం జిమ్‌లో రోజూలానే వర్కవుట్స్ కోసం వెళ్లాడు. కాసేపు జిమ్‌లో కష్టపడి వర్కవుట్స్ చేశాడు. ఉన్నట్లుండి జిమ్ చేస్తూ కుప్పకూలిపోయారు. దాంతో.. అది గమనించిన జిమ్ ట్రైనర్ సహా ఇతరులు జోగిందర్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆస్పత్రికి తరలించే లోపే జోగిందర్ దేశ్వాల్ ప్రాణాలు కోల్పోయారని వైద్యులు వెల్లడించారు. హార్ట్ ఎటాక్ కారణంగానే డీఎస్పీ జోగిందర్ చనిపోయారని వైద్యులు తెలిపారు. కాగా.. రోజూ జిమ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండే పోలీసు అధికారి ఉన్నట్లుండి హార్ట్ ఎటాక్‌కు గురి అయ్యి చనిపోవడం విషాదాన్ని నింపింది.
జోగిందర్ మృతితో హర్యానా పోలీసు శాఖలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల పోలీసు శాఖ, జైలు సిబ్బంది నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.