పొలిటికల్ రిటైర్మెంట్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఇవే..
ఇటీవల ఒక టాపిక్‌పై తెగ చర్చ జరుగుతోంది. అదే ప్రధాని నరేంద్ర మోదీ పొలిటికల్ రిటైర్మెంట్ గురించి.
By Srikanth Gundamalla Published on 24 May 2024 10:59 AM ISTపొలిటికల్ రిటైర్మెంట్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఇవే..
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హీట్ నడుస్తోంది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ పూర్తయింది. మిగతా రెండు దశల ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే.. జూన్ 4వ తేదీన లోక్‌సభ ఎన్నికలతో పాటు.. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయి. అయితే.. గెలుపే లక్ష్యంగా జాతీయ ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రచారంలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల ఒక టాపిక్‌పై తెగ చర్చ జరుగుతోంది. అదే ప్రధాని నరేంద్ర మోదీ పొలిటికల్ రిటైర్మెంట్ గురించి.
ప్రధాని నరేంద్రమోదీ 1950 సెప్టెంబర్ 17వ తేదీన జన్మించారు. ఆయన వయసు ఇప్పుడు 73 ఏళ్లు. బీజేపీ ఎక్కువగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చెబుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే బీజేపీ స్వయంగా ఒక నిబంధన పెట్టుకుందని ప్రచారం జరుగుతోంది. 75 ఏళ్లు పైబడిన నాయకులు యాక్టివ్ రాజకీయ నుంచి తప్పుకోవాలని అంటున్నారు. అంటే ప్రధాని మోదీ మరో రెండేళ్లు మాత్రమే యాక్టివ్ రాజకీయాల్లో ఉండాలన్నమాట. ఇదే ప్రచార అస్త్రంగా చేసుకుని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మోదీ హవాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ కేజ్రీవాల్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ రిటైర్మెంట్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. మోదీ నిజంగానే రెండేళ్ల తర్వాత యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
తాజాగా ప్రదాని నరేంద్ర మోదీ రిటైర్మెంట్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నేరుగా రిటైర్మెంట్ గురించి చెప్పకపోయినా.. పరోక్షంగా ఆయన మాటలు ఇదే అర్ధాన్ని ఇస్తున్నాయి. భారత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ఆ దేవుడు తనపై పెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం దేశం వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తుందని అన్నారు. 2047 నాటికి గమ్యానికి చేరకుంటామని ప్రధాని మోదీ అన్నారు. అప్పటి వరకు ఆ దేవుడు తనని పైకి పిలవడంటూ చమత్కరిస్తూనే రిటైర్మెంట్‌పై ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. అంటే ప్రధాని మోదీ వ్యాఖ్యల ప్రకారం.. రెండు దశాబ్దాల పాటు యాక్టివ్ రాజకీయాల్లో ఉంటానని చెప్పినట్లే అయ్యింది.