కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించిన ప్ర‌ధాని మోదీ.. ప్ర‌త్యేక పూజ‌లు

PM Modi visit Kedarnath Temple.ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఉత్త‌రాఖండ్‌లోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం కేదార్‌నాథ్ ఆల‌యాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2021 5:01 AM GMT
కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించిన ప్ర‌ధాని మోదీ.. ప్ర‌త్యేక పూజ‌లు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఉత్త‌రాఖండ్‌లోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం కేదార్‌నాథ్ ఆల‌యాన్ని శుక్ర‌వారం ఉద‌యం సంద‌ర్శించారు. ఆల‌యంలో ప్ర‌ధాని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ఆది గురువు శంక‌రాచార్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.

అంత‌క‌ముందు ప్ర‌ధాని మోదీ ఉత్తరాఖండ్ డెహ్రడూన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఉత్త‌రాఖండ్ గ‌వ‌ర్న‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్‌(రిటైర్డ్‌) గుర్మీత్ సింగ్‌, ఆ రాష్ట్ర సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. అక్క‌డి నుంచి ప్ర‌త్యేక విమానంలో కేదార్‌నాథ్ చేరుకున్నారు మోదీ. అక్క‌డి శివాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. 2013లో కేదార్‌నాథ్‌లో సంభ‌వించిన వ‌ర‌ద‌ల ధాటికి ఆది శంక‌రాచార్య స‌మాధి కూడా ధ్వంస‌మైంది. 2019లో ఈ స‌మాధి పున‌ర్నిర్మాణంతో పాటు 12 అడుగుల ఆదిశంక‌రాచార్య విగ్ర‌హా నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయ‌గా.. నేడు వాటిని మోదీ ప్రారంభించారు. అనంత‌రం ఆదిశంక‌రాచార్య విగ్ర‌హం వ‌ద్ద కాసేపు కూర్చున్న ప్ర‌ధాని కొద్ది సేపు ధ్యానం చేశారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ ప‌లు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయ‌నున్నారు. సరస్వతి ఘాట్ తో పాటు రూ.130 కోట్లతో నిర్మించిన‌ ఇన్‌ ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించ‌నున్నారు. మోదీ కేదార్‌నాథ్‌ పర్యటన నేప‌థ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు దేశ వ్యాప్తంగా సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు.

Next Story