లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ సాహసాలు

ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  4 Jan 2024 2:00 PM GMT
pm modi, tour, lakshadweep, snorkeling, viral photos,

లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ సాహసాలు

ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఈ టూర్‌లో భాగంగా గురువారం ఆయన సాహసోపేతమైన స్నార్కెలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్వాస తీసుకునేందుకు ట్యూబ్‌తో అనుసంధానించిన డైవింగ్‌ ఆస్క్‌ను ధరించి సముద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్విమ్మింగ్ చేశారు. స్నార్కెలింగ్‌ విధానంలో తల సహా పూర్తి శరీరాన్ని నీటిలో ఉంచి.. ముఖాన్ని కిందకు ఉంచి స్విమ్మింగ్ చేస్తారు. ఈ సాహసం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఒక పోస్టులో తాను స్నార్కెలింగ్ చేసిన ఫోటోలను పోస్టు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మరో పోస్టులో జల చరాల ఫొటోలు కూడా పంచుకున్నారు. ఆ తర్వాత సముద్ర తీరాన ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంతంగా సేదతీరుతూ ఉన్నారు. తెల్లటి కుర్తాలో కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇసుక, సముద్రపు నీళ్లు కనిపిస్తున్నాయి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. తెల్లటి చెప్పులు ధరించిన ప్రధాని నరేంద్ర మోదీ అటు ఇటూ తిరుగుతూ షికారు చేశారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన ప్రధాని మోదీ.. సాహసం చేయాలని అనుకునే వారు లక్షద్వీప్‌ను తమ జాబితాలో చేర్చుకోవాలన్నారు. తన విడిది సమయంలో స్నార్కెలింగ్‌ను ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. స్నార్కెలింగ్ నిజంగా అద్భుతంగా ఉందని.. అనుభూతి మాటల్లో చెప్పలేనంత బాగుందన్నారు. ప్రకృతి అందాలతో పాటు లక్షద్వీప్‌ ప్రశాంతత కూడా మంత్రముగ్ధులను చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడి ఎలా పనిచేయాలో లక్షద్వీప్‌ ఆలోచన కలిగించిందని ప్రధాని ట్వీట్‌లో రాసుకొచ్చారు.


Next Story