రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పెంపు..!

కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  11 Oct 2023 4:15 PM IST
PM kisan samman fund,  increase, central govt,

 రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పెంపు..!

కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు పంటపెట్టుబడి సాయం అందిస్తోంది. ఏటా మూడు విడదలుగా రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలు అందిస్తోంది కేంద్రం. అయితే.. ఆ మొత్తాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న 6వేల రూపాయలను రూ.8వేలకు పెంచాలని కేంద్రం భావిస్తోందట. అంతేకాదు.. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడనుందని సమాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఇచ్చే మొత్తం పెంచనున్నట్లు తెలుస్తోంది.

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ సారి ఆ మొత్తాన్ని పెంచాలని కేంద్రం భావిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో రైతుల మనసులు గెలుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి మొత్తాన్ని రూ.8వేలకు పెంచే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. ఒక వేళ రూ.2వేలు అదనంగా పెంచి రైతులకు అందిస్తే ప్రభుత్వ ఖజానాపై రూ.20వేల కోట్ల అదనపు భారం పడనుంది.

అయితే.. దేశంలో 140 కోట్ల మంది జనాభాలో దాదాపు 65 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే వారందరి ఓట్లు అత్యంత కీలకం. ఇప్పటికే మూడు విడుతలుగా రూ.2వేల చొప్పున పీఎం కిసాన్‌ డబ్బులు జమ అవుతున్నాయి. అయితే.. ఈ మొత్తం పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కానీ.. కిసాన్‌ డబ్బులు పెంపుపై ఎక్కువ మొగ్గు చూపుతోంది కేంద్రం. మరోవైపు ఎన్నికల వేళ ఉచిత రేషన్‌ పథకాన్ని మరోసారి పొడిగించే అవకాశాలు ఉన్నాయి.

Next Story