భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ శుక్రవారం కూలిపోయింది. జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఫైలట్ మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనారోగ్యంతో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లను తరలించేందుకు ఈ హెలికాఫ్టర్ వెళ్లినట్లు చెబుతున్నారు. గురేజ్ సెక్టార్‌లో మంచుతో నిండిన బరౌమ్ ప్రాంతంలో ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి లోయలోకి జారి పోయిందని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో పైలట్ మరణించగా కో పైలట్‌కు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. వెంటనే కో ఫైలట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలను హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆర్మీ ఆదేశాలు జారీచేసింది.