శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోని భక్తులు కూడా అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చని పినరయి విజయన్ ప్రభుత్వం ప్రకటించింది.
By అంజి Published on 16 Oct 2024 2:15 AM GMTశబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోని భక్తులు కూడా అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చని పినరయి విజయన్ ప్రభుత్వం ప్రకటించింది. వర్చువల్ బుకింగ్‌పై విపక్షాలు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో విజయన్ దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వచ్చిన వారికి కూడా దర్శన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అంతకుముందు శబరిమల మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్‌లో ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే యాత్రికులను అనుమతించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకు గరిష్టంగా 80 వేల మంది భక్తులను అనుమతించేలా సౌకర్యాలు కల్పించాలనుకుంది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. వర్చువల్ క్యూ బుకింగ్ లేకుండా శబరిమల దర్శనం చేసుకునే భక్తులకు కూడా అయ్యప్ప స్వామి ఆలయంలో సాఫీగా దర్శనం కల్పిస్తామని కేరళ ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది.
వచ్చే తీర్థయాత్రల సీజన్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే దర్శనం కల్పించాలన్న గతంలో తీసుకున్న నిర్ణయాన్ని విస్తృత నిరసనల మధ్య పినరయి విజయన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. (ఆన్‌లైన్) రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చే యాత్రికులకు కూడా సులభ దర్శనం కోసం సౌకర్యాలు కల్పిస్తామని... ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోని వారికి, సిస్టమ్ గురించి తెలియకుండా వచ్చిన వారికి దర్శనం కల్పిస్తామని సీఎం పినరయి చెప్పారు.
గత యాత్రికుల సీజన్‌లోనూ కొండ గుడిలో ఇలాంటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. అయితే, ముఖ్యమంత్రి తన సంక్షిప్త ప్రసంగంలో, వర్చువల్ క్యూ బుకింగ్‌తో పాటు మునుపటి సంవత్సరంలో మాదిరిగానే స్పాట్ బుకింగ్ సిస్టమ్‌ను నిర్వహిస్తారా లేదా అనేది స్పష్టంగా చెప్పలేదు. అక్టోబరు 5న జరిగిన సమావేశంలో శబరిమలలో యాత్రికుల స్పాట్ బుకింగ్‌ను అనుమతించడంపై చర్చించినట్లు ఆయన తెలిపారు.
కొండ గుడికి చేరుకునే భక్తులందరికీ సురక్షితమైన, సాఫీగా దర్శనం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించినట్లు సీఎం వివరించారు. వర్చువల్ క్యూ రిజిస్ట్రేషన్ ద్వారా యాత్రికుల వివరాలు డిజిటల్ డాక్యుమెంట్‌గా అందుబాటులో ఉంటాయని, ఇది భద్రతను నిర్ధారించడానికి, తీర్థయాత్ర సమయంలో ప్రమాదాలు లేదా తప్పిపోయిన సంఘటనలు సంభవించినప్పుడు వ్యక్తులను గుర్తించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.