చేయని తప్పుకు.. 8 నెలల తర్వాత విడుదలైన పావురం

గూఢచర్యం కోసం చైనీయులు ఉపయోగించినట్లు అనుమానించి బంధించిన

By Medi Samrat  Published on  31 Jan 2024 1:57 PM GMT
చేయని తప్పుకు.. 8 నెలల తర్వాత విడుదలైన పావురం

గూఢచర్యం కోసం చైనీయులు ఉపయోగించినట్లు అనుమానించి బంధించిన పావురాన్ని ఎనిమిది నెలల తర్వాత వదిలిపెట్టారు. ఆ పావురం వెటర్నరీ ఆసుపత్రిలో కస్టడీలో ఇన్నాళ్లూ ఉంది. 2023 మేలో ముంబైలోని చెంబూరు పీర్ పావు జెట్టీ దగ్గర ఆర్ఎఫ్సీ పోలీసులు పావురాన్ని పట్టుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ఈ పావురానికి రెండు ఉంగరాలు గుర్తించారు. రాగి, అల్యూమినియం రింగ్స్ పావురం కాలికి ఉంచారు. పావురం రెక్కల కింది భాగంలో చైనీస్ లో సందేశం ఉండడంతో గూఢచర్యం అనుమానాలు వచ్చాయి. దీనిపై గతంలో ఆర్ఎఫ్ సి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పూర్తయ్యాక గూఢచర్యం కేసుని ఎత్తివేశారు.

పరేల్ ప్రాంతంలోని బాయి సకర్‌బాయి దిన్‌షా పెటిట్ హాస్పిటల్ ఫర్ యానిమల్స్ సోమవారం పక్షిని విడుదల చేసేందుకు పోలీసుల అనుమతిని కోరింది. అధికారుల నుండి నో అబ్జెక్షన్ రావడంతో మంగళవారం నాడు విముక్తి పొందిందని ఆర్‌సిఎఫ్ (రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్) పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు. కేసు దర్యాప్తులో పావురం తైవాన్ కు చెందినదిగా గుర్తించారు. ఆ కపోతం వాటర్ రేసింగ్ లో పాల్గొనేందుకు వాడేదని.. పోటీ సందర్భంగా దేశం దాటి భారత్ వచ్చినట్లు గుర్తించారు. పాపం చేయని తప్పుకు పావురం 8 నెలలు బందీగా ఉండాల్సి వచ్చింది.


Next Story