దేశంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. గతంలో విమానాలను సైతం నిలిపివేయగా, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టగానే వివిధ దేశాలకు విమాన సర్వీసులు యథావిధిగా నడుపుతుంది విమానయాన సంస్థ. ఇప్పుడు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో పౌరవిమానయాన సంస్థ అప్రమత్తమైంది. విమానంలో ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ). తాజాగా డీజీసీఏ జారీ చేసిన నిబంధనల ప్రకారం.. విమానంలో ప్రయాణించే వారు తప్పకుండా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. లేకపోతే విమాన ప్రయాణానికి అనుమతి ఇవ్వరు.
తాజాగా డీజీసీఏ కొత్త నిబంధనలు..
► విమాన ప్రయాణ సమయంలో ప్రయాణికులు తప్పకుండా మాస్క్ ధరించాలి. అంతేకాదు సామాజిక దూరం పాటించాలి. లేకపోతే ప్రయాణానికి అనుమతి ఇవ్వరు.
► విమాన ప్రవేశద్వారాల వద్ద సీఐఎస్‌ఎఫ్, పోలీసు సిబ్బంది ప్రయాణికులను గమనించాలి. మాస్క్‌లేని వారి అనుమతించరాదు.
► విమానంలో ప్రయాణికులు తప్పకుండా శానిటైజ్ చేసుకోవాలి. అప్పుడే లోపలికి అనుమతి ఇవ్వాలి.
► విమానాశ్రయం ప్రాంగణంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించేలా చూడాలి. భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. నిబంధనలు పాటించని ప్రయాణికలకు వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించింది.
► విమానంలో ఎక్కత తర్వాత అందరూ మాస్క్‌లు ధరించారా.?లేదా చూడాలి. సిబ్బంది హెచ్చరించినా.. ప్రయాణికుడు మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యం వహించినట్లయితే టేకాఫ్‌కు ముందే విమానం నుంచి దింపేయాలి.
► ప్రయాణ సమయంలో ప్రయాణికులు కోవిడ్ నిబంధనలు పదేపదే ఉల్లంఘించినట్లయితే వారిని నిషేధిత జాబితాలోని ప్రయాణికుడిగా పరిగణించాలి. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.