వెంటనే ఆధార్‌తో లింక్‌ చేసుకోండి.. లేదంటే పాన్‌కార్డు చెల్లదు

Pan Aadhaar Linking Deadline On March 31, 2023. పాన్‌కార్డుతో ఆధార్‌ కార్డును లింక్‌ చేసుకునే గడువును ఆదాయ పన్ను శాఖ (ఐటీ విభాగం) మరోసారి

By అంజి  Published on  25 Dec 2022 4:40 AM GMT
వెంటనే ఆధార్‌తో లింక్‌ చేసుకోండి.. లేదంటే పాన్‌కార్డు చెల్లదు

పాన్‌కార్డుతో ఆధార్‌ కార్డును లింక్‌ చేసుకునే గడువును ఆదాయ పన్ను శాఖ (ఐటీ విభాగం) మరోసారి పెంచింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు డెడ్‌లైన్‌ పెట్టింది. ఆ లోపు తప్పనిసరిగా ఆధార్‌ను పాన్‌కు వెంటనే లింక్‌ చేసుకోవాలని చెప్పింది. ఆలస్యం చేయవద్దని ప్రజలకు సూచించింది. మార్చి 31 తర్వాత పాన్‌కార్డుతో ఆధార్‌ లింక్‌ గడువును మరోసారి పెంచేది లేదని స్పష్టం చేసింది. ఒక వేళ మార్చి 31వ తేదీ లోపు ఆధార్‌తో లింకవ్వకపోతే పాన్‌కార్డు చెల్లదని తెలిపింది.

పాన్‌ కార్డు కలిగిన వారందరూ.. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం తప్పనిసరిగా 2023 మార్చి 31లోగా ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఐటీ విభాగం స్పష్టం చేసింది. లింక్‌ చేయకపోతే 2023 ఏప్రిల్‌ 1 నుంచి ఆ పాన్‌ కార్డు చెల్లదని తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ జారీచేసినట్టు అసోం, జమ్ము అండ్‌ కశ్మీర్‌, మేఘాలయ రాష్ట్రాల్లో ఉన్న వారికి మినహాయింపు కొనసాగనున్నది. ఒకవేళ పాన్‌ కార్డు రద్దయితే ఐటీ చట్టం ప్రకారం ఆర్థిక లావాదేవీలు జరిపే అర్హతను కోల్పోతారు. అలాంటి వ్యక్తి ఐటీ రిటర్నులు దాఖలు చేయలేరు, పెండింగ్‌ రిటర్నులు ప్రాసెసింగ్‌ చేయలేరు, పెండింగ్‌ రిఫండ్‌లను కూడా పొందలేరని సీబీడీటీ తెలిపింది.


Next Story