వాక్సినేషన్‌లో ఆదర్శంగా త్రివిధ దళాలు

95% Indian Army Persons have taken first dose. టీకాలు తీసుకోవడం లో కూడా సైన్యం తన స్ఫూర్తిని చాటింది. దేశవ్యాప్తంగా 97 శాతం మందికి ఫస్ట్ డోస్ ఇచ్చినట్టు రక్షణ శాఖ ప్రతినిధులు వెల్లడించారు.

By Medi Samrat  Published on  26 April 2021 10:15 AM IST
Indian army vaccination

మన దేశానికి కనపడే శత్రువుల నుంచి మాత్రమే కాదు, కనబడకుండా కల్లోలం సృష్టిస్తున్న కరోనా తో పోరాడటానికి కూడా సైనికులు సిద్ధం అవుతున్నారు. కరోనా మహమ్మారితో పోరుకు వ్యాక్సిన్ మాత్రమే ఆయుధం కావడంతో టీకాలు తీసుకోవడం లో కూడా సైన్యం తన స్ఫూర్తిని చాటింది. దేశవ్యాప్తంగా 97 శాతం మందికి ఫస్ట్ డోస్, 76 శాతం మందికి సెకండ్ డోస్ ఇచ్చినట్టు రక్షణ శాఖ ప్రతినిధులు వెల్లడించారు.

త్రివిధ దళాలు కలిపి మొత్తంగా 15.5 లక్షల మంది సైనికులు పస్ట్ డోస్ టీకాను తీసుకున్నారని, సైన్యంలోని లక్ష మంది ఆరోగ్య సిబ్బందీ వ్యాక్సిన్ తీసుకున్నారని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 11.7 లక్షల మంది సైనికులు సెకండ్ డోస్ కూడా తీసుకున్నారని, 90 వేల మంది ఆరోగ్య సిబ్బందీ సెకండ్ డోస్ వేయించుకున్నారని స్పష్టం చేశారు. ఇండియన్ ఆర్మీలోని 13 లక్షల మంది సిబ్బందికిగానూ 99 శాతం మంది టీకా తీసుకున్నారు. 82 శాతం మంది రెండో డోసు కూడా పూర్తి చేసుకున్నారు.

ఇక భారత వైమానిక దళంలో 2 లక్షల మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. అందులో 90 శాతం మంది రెండు డోసులూ తీసుకున్నారు. వైమానిక సిబ్బంది తమ విధి నిర్వర్తించాలి అంటే 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి. ఇక నేవీ సిబ్బందికి వంద శాతం వ్యాక్సినేషన్ జరిగింది. అంటే నావికా దళం లో లక్ష మంది పనిచేస్తుండగా మొత్తం అందరూ టీకాలు తీసుకున్నారు. త్రివిధ దళాల్లోనూ కొవిషీల్డ్ వ్యాక్సిన్ నే వేస్తున్నారు. ఎంత వాక్సిన్ వేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, త్రివిధ సిబ్బంది ముఖ్య సమావేశాలు అన్ని వర్చువల్ గానే జరుగుతున్నాయి. మరోవైపు సైనిక సిబ్బంది కుటుంబ సభ్యులకూ సర్వీస్ ఆసుపత్రుల్లో టీకాలు వేస్తున్నారు. 45 ఏళ్లు దాటిన అర్హులందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. మాజీ సైనికులకూ ఆర్మీ వ్యాక్సిన్ వేస్తోంది. ఇప్పటిదాకా త్రివిధదళాలు, సరిహద్దు రహదారుల నిర్వహణ సంస్థ సిబ్బంది, తీర రక్షక దళాలు కలిపి 44 వేల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 150 మంది ప్రాణాలు కోల్పోయారు.


Next Story