ప్రపంచంలోని అన్ని దేశాలలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. భారతదేశంలో కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ గత ఐదు రోజుల నుంచి విస్తారంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగానే మొదటగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ ఈ వ్యాక్సిన్ అందజేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే కరోనా వ్యాక్సిన్ వల్ల ఇజ్రాయిల్ లో 12 వేల మంది కరోనా బారిన పడ్డారు. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కరోనా నిర్ధారణ కావడంతో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
గత ఏడాది డిసెంబర్ 19న ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగానే వృద్ధులకు, హెల్త్ రిస్క్ ఎక్కువగా వారికి, వైద్య సిబ్బందికి కైసర్ వ్యాక్సిన్ ను వేశారు.వీరిలో మొత్తం 1,89,000 మందికి మరో సారి కోవిడ్ టెస్ట్ నిర్వహించగా.. 12,400 మందికి అనగా 6.6 శాతం జనాభాకి కరోనా పాజిటివ్‌గా అది నిర్ధారణ కావడంతో తీవ్ర సంచలనం సృష్టించింది.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కరోనా సోకిన వారిలో 69 మందికి సెకండ్ డోస్ కూడా ఇచ్చారు. అయితే ఫైజర్ వ్యాక్సిన్ పై వారు పెట్టుకున్న అంచనాలు కన్నా తక్కువ సామర్థ్యం తోనే పని చేస్తోందని నేషనల్ కోఆర్డినేటర్ అండ్ పాండమిక్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దాదాపు నెల రోజుల నుంచి ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ 2.2 మిలియన్ మందికి టీకాలు వేసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి తెలియజేశారు. ఇందులో 3.5 శాతంమందికి సెకండ్ డోస్ ఇచ్చినప్పటికీ కూడా ఈ మహమ్మారి ఏమాత్రం కట్టడి కాకపోవడంతో ఇజ్రాయెల్ దేశంలో మరోసారి లాక్ డౌన్ విధించారు. ఇప్పటికే ఈ దేశంలో దాదాపు 6 మిలియన్ కేసులు నమోదు కాగా 4,005 మంది ఈ వైరస్ బారిన పడి మృతి చెందినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.