పానీ పూరీ తిని 100 మందికిపైగా అస్వస్థత

Over 100 people fall sick after eating pani puri in Bengal's Hooghly. పానీ పూరీ తిని 100 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వెస్ట్‌ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో

By అంజి  Published on  11 Aug 2022 2:11 PM GMT
పానీ పూరీ తిని 100 మందికిపైగా అస్వస్థత

పానీ పూరీ తిని 100 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వెస్ట్‌ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో జరిగింది. సుగంధ గ్రామ పంచాయతీలోని డోగాచియా ప్రాంతంలోని వీధి దుకాణంలో పానీ పూరీ తిని 100 మందికిపైగా అనారోగ్యం బారినపడ్డారు. అనారోగ్యం బారిన పడిన వారిలో డయేరియా లక్షణాలు కనిపించాయి. అస్వస్థతకు గురైన వారిలో అతిసారం లక్షణాలను కనిపించాయి. వాంతులు, కడుపు నొప్పితో బాధపడ్డారు.

సమాచారం అందుకున్న వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రోగులకు మందులు అందించారు. చాలా మంది జబ్బుపడిన వ్యక్తులకు తీవ్రమైన అనారోగ్యం కనిపించినందున వారిని ఆసుపత్రులలో చేరమని వైద్య బృందం కోరింది. అస్వస్థతకు గురైన వారిలో డోగాచియా, బహిర్ రణగాచా, మకల్తలా ప్రాంతాలకు చెందిన నివాసితులు ఉన్నారు. గతంలో కూడా పానీపూరి తిని ప్రజలు అస్వస్థతకు గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

Next Story