ప్యాంటు జిప్ తీయ‌‌డం లైంగిక దాడి కాదు.. బాంబే హైకోర్టు

Opening minor girls' pants zip not a sexual assault. నేరుగా శ‌రీరార్ని తాకితేనే లైంగిక దాడిగా ప‌రిగ‌ణించాలంటూ బాంబే హైకోర్టు తీర్పు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2021 4:08 PM IST
Opening minor girls pants zip not a sexual assault

నేరుగా శ‌రీరాన్ని తాకితేనే లైంగిక దాడిగా ప‌రిగ‌ణించాలంటూ తీర్పు చెప్పిన కొన్ని రోజుల‌కే బాంబే హైకోర్టు మ‌రోసారి అలాంటి తీర్పునే వెలువ‌రించింది. మైన‌ర్ బాలిక చేయి ప‌ట్టుకోవ‌డం, ఆమె ప్యాంటు జిప్ తీయ‌డం ప్రొటెక్ష‌న్ ఆఫ్ చిల్డ్ర‌న్ ఫ్రం సెక్సువ‌ల్ అఫెన్సెస్ యాక్ట్ (పోక్సో) కింద లైంగిక దాడి కాద‌ని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ చెప్పింది. అయితే భారత శిక్షాస్మృతి 354-ఏ(1)(i) సెక్షన్‌ కింద వీటిని లైంగిక వేధింపులుగా ప‌రిగణించవచ్చన్నారు. యాభై ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ నమోదైన కేసులో జస్టిస్‌ పుష్ప ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

50ఏళ్ల ఓ వ్య‌క్తి ఐదేళ్ల బాలిక‌పై లైంగిక వేదింపుల‌కు పాల్ప‌డ్డాడు. దీనిపై బాలిక త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. నిందితుడు త‌న కూతురి చేతులు ప‌ట్టుకుని, అత‌డి ప్యాంటు జిప్ తెర‌చి.. వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డ్డాడ‌ని బాధితురాలి త‌ల్లి ఆరోపించింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈక్ర‌మంలో సెష‌న్స్ కోర్టులో పోక్సో చ‌ట్టంలోని సెక్ష‌న్ 10 కింద తీవ్ర‌మైన లైంగిక వేదింపుల‌కు పాల్ప‌డినందుకు అత‌డికి 5 ఏళ్ల క‌ఠిన కారాగార శిక్ష‌తో పాటు 25 వేల జ‌రిమానా విధించింది.

దీనిపై హైకోర్టులో అప్పీల్ చేయ‌గా.. అది పోక్సో చ‌ట్టం కింద లైంగిక దాడి కాద‌ని జ‌స్టిస్ పుష్ప గ‌నేడివాలా స్ప‌ష్టం చేశారు. ఆ చ‌ట్టం కింద విధించిన శిక్ష‌ను ర‌ద్దు చేశారు. గ‌రిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష మాత్ర‌మే విధించ‌గ‌లిగే ఐపీసీ సెక్షన్ 354 కింద నిందితుడిపై అభియోగాలు మోపారన్నారు. అయితే అప్ప‌టికే అత‌డు ఐదు నెల‌ల జైలు శిక్ష అనుభ‌వించి ఉండ‌టంతో.. ఈ నేరానికి ఆ శిక్ష స‌రిపోతుంద‌ని కోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 19న నాటి తీర్పులో జ‌స్టిస్ పుష్ష.. దుస్తుల‌పై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్ర‌న అది పోక్సో నేరం అవ‌దు. చ‌ర్మాన్ని చ‌ర్మం తాకాలి. కానీ ఈ కేసులో అలా జ‌ర‌గ‌లేదు అని పేర్కొన్న విష‌యం తెలిసిందే. కాగా.. ఈ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించిన సంగ‌తి తెలిసిందే.



Next Story