విజిలెన్స్‌ తనిఖీలు.. రూ.2కోట్లు పక్కింట్లో పడేసిన అధికారి

నోట్ల కట్టలను బాక్సుల్లో పెట్టి విజిలెన్స్‌కు దొరక్కుండా పక్కింటిపై విసిరేశాడు. దాదాపు రూ.2కోట్లకు పైగా నగదును..

By Srikanth Gundamalla  Published on  23 Jun 2023 8:28 PM IST
Odisha, Vigilance, Seize 2 Crore, Sub Collector

విజిలెన్స్‌ తనిఖీలు.. రూ.2కోట్లు పక్కింట్లో పడేసిన అధికారి

ఒడిశాలో విజిలెన్స్‌ అధికారులో ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో సోదాలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సదురు అధికారి నోట్ల కట్టలను బాక్సుల్లో పెట్టి విజిలెన్స్‌కు ఎక్కడ దొరకుతాననే భయంతో పక్కింటిపై విసిరేశాడు. దాదాపు రూ.2కోట్లకు పైగా నగదును విసిరేశాడు. అధికారులు అతని బాగోతాన్ని చివరకు బయటపెట్టారు.

నబరంగ్‌పుర్‌ జిల్లా అదనపు సబ్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌ రౌత్‌ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో.. విజిలెన్స్ అధికారులు అతని నివాసాల్లో సోదాలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే భువనేశ్వర్‌లోని ప్రశాంత్‌కుమార్ ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లారు. అధికారులు ఉన్నట్లుండి రావడంతో ప్రశాంత్‌ కుమార్‌ ఆందోళన చెందాడు. అప్పటికే ఇంట్లో చాలా డబ్బు ఉంది. ఎలాగోలా విజిలెన్స్ అధికారుల కళ్లు గప్పాలని ప్రయత్నించాడు. దీంతో.. అతను డబ్బుని బాక్సుల్లోకి సర్దేశాడు. ఆ తర్వాత వాటిని తన పక్కింటి టెర్రస్‌ పైకి విసిరేశాడు. అయితే.. అధికారులు అతని ఇంట్లో ముందు సోదాలు జరిపారు. ఎక్కడ ఏమీ కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది.

అప్పుడే టెర్రస్‌పైకి వెళ్లగా పక్కింటిపై అనుమానాస్పదంగా బాక్సులు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. గట్టిగా నిలదీసి అడగ్గా ఆ డబ్బు తనదే అని.. తానే పక్కింటిపై విసిరినట్లు చెప్పాడు. అయితే.. సదురు అధికారి రూ.2000 నోట్లను రూ.500 నోట్ల కింద మార్పిడి చేయించారని విజిలెన్స్ అధికారులు చెప్పారు. ప్రశాంత్ కుమార్ ఇంట్లో రూ.2.25 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులె వెల్లడించారు. మరో తొమ్మిది ప్రాంతాల్లోనూ సోదాలు చేశామని.. నబరంగ్‌పుర్‌లో రూ.77 లక్షలు సీజ్ చేశామని చెప్పారు. మొత్తం రూ.3 కోట్ల నగదుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే.. మైనింగ్‌ మాఫియాకు సహకరిస్తూ సబ్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌ అవినీతికి పాల్పడి పెద్దమొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ప్రశాంత్‌ కుమార్‌ లంచం డిమాండ్ కేసులో ఒకసారి అరెస్ట్‌ అయ్యాడు. తాజా సోదాలతో మరోసారి చిక్కుల్లో పడ్డాడు. నోట్ల కట్టలను బాక్సుల్లో పెట్టి విజిలెన్స్‌కు ఎక్కడ దొరకుతాననే భయంతో పక్కింటిపై విసిరేశాడు. దాదాపు రూ.2కోట్లకు పైగా నగదును

Next Story