రత్న భాండాగారంలో మరో రహస్య గది, సొరంగ మార్గం..!
ఒడిశా పూరీలోని జగన్నాథుడి రత్న భాండాగారాన్ని ఎట్టకేలకు తెరిచారు అధికారులు.
By Srikanth Gundamalla Published on 16 July 2024 2:42 AM GMTరత్న భాండాగారంలో మరో రహస్య గది, సొరంగ మార్గం..!
ఒడిశా పూరీలోని జగన్నాథుడి రత్న భాండాగారాన్ని ఎట్టకేలకు తెరిచారు అధికారులు. దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్నభాండాగారం తెరుచుకోవడంతో అందులో ఉన్న అపార సంపదపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పిటికే లెక్కింపు కొనసాగిస్తున్నారు అధికారులు. అయితే.. తాజాగా రత్న భాండాగారంలో మరో రహస్య గది ఉందని ఒడిశాకు చెందిన పలువురు చరిత్రకారులు చెబుతున్నారు. దానికి కోసం సొరంగం నుంచి వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు. దాని లోపల విలువైన సంపద దాచిపెట్టారని అంటున్నారు. బ్రిటిషర్ల హయాంలో 1902లో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించారని.. కానీ అప్పుడు విఫలమయ్యారంటూ వెల్లడిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సొరంగ మార్గంలో ఉన్న రహస్య గదిని అన్వేషించాలని అంటున్నారు. అపార సంపద ఉంటుందని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
ముస్లిం దండయాత్రల సమయంలోనూ పలుమార్లు కళింగ సామ్రాజ్యంపై దాడులు జరిగాయి. ఆ సందర్భంగా స్వామివారి సంపదలను కాపాడేందుకు నాటి రాజు పూరీ క్షేత్రం దిగువన రహస్య గదులు నిర్మించారని చరిత్రకారుడు డాక్టర్ నరేశ్‌చంద్ర దాస్ తెలిపారు. నిధులను వాటిలో దాచారని వెల్లడించారు 1902లో బ్రిటిష్ పాలకులు ఈ విషయం తెలుసుకుని రహస్య గదిలో సందప కోసం సొరంగ మార్గంలో వెళ్లే ప్రయత్నం చేసినా సఫలం కాలేదని ఆయన చెప్పారు. ఇ్టపి వరకు ఎవరూ కొనుగొనలేదని నరేశ్ చంద్ర దాస్ అన్నారు.
రత్న భాండాగారం తెరిచిన ఒడిశా సర్కార్ మరమ్మతులు, సంపద లెక్కింపును చేపడుతోంది. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిష్టగా కొనసాగిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురుషోత్తముడి భక్తులకు వాస్తవాలు తెలియజేస్తామని అంటున్నారు. ఇక మూడో గది డూప్లికేట్ కీ గురించి సమగ్ర దర్యాప్తు జరిపి.. అసలు తాళం చెవి ఏమైందో కూడా ప్రజలకు తెలియజేస్తామని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.