ఒడిశా కేబినెట్‌: ముగ్గురు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం తన కేబినెట్‌లో ముగ్గురు కొత్త మంత్రులను చేర్చుకున్నారు. లోక్‌సేవా భవన్‌లోని స్టేట్ కన్వెన్షన్

By అంజి  Published on  22 May 2023 7:30 AM GMT
Odisha news, CM Naveen Patnaik , Cabinet Ministers

ఒడిశా కేబినెట్‌: ముగ్గురు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం తన కేబినెట్‌లో ముగ్గురు కొత్త మంత్రులను చేర్చుకున్నారు. లోక్‌సేవా భవన్‌లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో బిజెడి సీనియర్ ఎమ్మెల్యేలు బిక్రమ్ కేశరి అరుఖా, సుదామ్ మార్ండి, శారదా ప్రసాద్ నాయక్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలో గవర్నర్ ప్రొఫెసర్ గణేశిలాల్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

అరుఖా, మార్ండి, నాయక్ గతంలో పట్నాయక్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. అరుఖా 2008 నుండి ప్రభుత్వ చీఫ్ విప్, స్పీకర్, గ్రామీణాభివృద్ధి, చట్టం, అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పు, పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచారం & ప్రజా సంబంధాలు, సహకారం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రితో సహా అనేక పదవులను నిర్వహించారు. అదేవిధంగా, మార్ండి గతంలో క్రీడలు, యువజన సేవలు, ST & SC అభివృద్ధి (గిరిజన సంక్షేమం), రెవెన్యూ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఈసారి మర్ందిని కేబినెట్ హోదాకు ఎలివేట్ చేశారు.

నాయక్ 2009 నుండి 2012 మధ్య కాలంలో ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమం, హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్, ఎక్సైజ్‌లకు మంత్రిగా పనిచేశారు. ఇద్దరు వివాదాస్పద మంత్రులు సమీర్ రంజన్ దాష్ (పాఠశాల మరియు మాస్ ఎడ్యుకేషన్), శ్రీకాంత సాహు (లేబర్ అండ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్) మే 12న తమ పదవులకు రాజీనామా చేశారు. అంతేకాకుండా, ఈ ఏడాది జనవరి 29న మాజీ ఆరోగ్య మంత్రి నబా కిషోర్ దాస్ హత్యకు గురికావడంతో మంత్రివర్గంలో మరో ఖాళీ ఏర్పడింది.

ఒడిశా మంత్రి మండలిలో ముఖ్యమంత్రితో సహా 22 మంది మంత్రులు ఉండవచ్చు. తాజాగా ముగ్గురు కొత్త మంత్రుల చేరారు. మరికొందరు మంత్రుల శాఖల్లో కూడా ముఖ్యమంత్రి త్వరలో మార్పులు చేయవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే రాష్ట్ర అసెంబ్లీ తదుపరి స్పీకర్ ఎవరనేది ఇంకా తేలలేదు. స్పీకర్ పదవికి ప్రఫుల్ల సమల్, దేబీ ప్రసాద్ మిశ్రా, అమర్ ప్రసాద్ సత్పతి, స్నేహాంగిని చురియా, బద్రీ నారాయణ్ పాత్ర పేర్లు వినిపిస్తున్నాయి. నవీన్ పట్నాయక్ చివరిసారి జూన్ 2022లో తన క్యాబినెట్‌ను పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. కాబట్టి, ఈ టర్మ్‌లో ఇది రెండోసారి ఆయన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ.

Next Story