మిస్టరీగా.. అజిత్ దోవల్ హైదరాబాద్ 'రహస్య' పర్యటన
NSA Ajit Doval’s ‘secret’ visit to Hyderabad shrouded in mystery. హైదరాబాద్ : భారత దేశ రహస్య కార్యకలాపాలు నిర్వహించడంలో జాతీయ భద్రతా సలహాదారు
By అంజి Published on 1 Dec 2022 9:51 AM GMTహైదరాబాద్ : భారత దేశ రహస్య కార్యకలాపాలు నిర్వహించడంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు మంచి పేరుంది. ఈసారి రాష్ట్ర పోలీసులకు, ఇంటెలిజెన్స్‌కు సమాచారం ఇవ్వకుండానే ఎన్‌ఎస్‌ఏ హైదరాబాద్‌లో రహస్య పర్యటన చేసినట్లు సమాచారం. అజిత్ దోవల్ ఎలాంటి భద్రత లేకుండా ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారని, సాధారణ పౌరుడిలా చిన్న కారులో ప్రయాణించారని, కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలిశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దాదాపు మూడు గంటలపాటు హైదరాబాద్‌లోనే ఉండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
భారతదేశ అంతర్గత భద్రత కోసం దోవల్ అనేక ప్రధాన కార్యకలాపాలు నిర్వహించారని తెలుస్తోంది. దోవల్.. పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో చాలా కాలంగా బిచ్చగాడిలా వేషాలు వేసుకుని రహస్యంగా గూఢచర్యం చేస్తూ భారత్‌కు కీలక సమాచారం అందించాడు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లోకి ఉగ్రవాదులు చొరబడినప్పుడు కూడా, బ్లాక్ థండర్ II ఆపరేషన్ సమయంలో రిక్షా పుల్లర్‌గా మారువేషంలో వెళ్లి పరిస్థితిని భద్రతా అధికారులకు తెలియజేశాడు.
జాతీయ భద్రతా సలహాదారు హైదరాబాద్ ఎందుకు వచ్చారు? మరీ ఈ పర్యటనను రహస్యంగా ఉంచడానికి కారణం ఏమిటి? ఎవరిని కలిశాడు? ఏ మిషన్ కింద హైదరాబాద్ వచ్చాడు? ఈ ప్రశ్నలన్నీ రహస్యంగా ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో కొంతమంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) కార్యకర్తలను అరెస్టు చేశారు. దీంతోపాటు తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యకలాపాలు ఒక్కసారిగా పెరిగాయి. జాతీయ భద్రతా సలహాదారు రహస్య పర్యటన కూడా ఈ నేపథ్యంలోనే కనిపిస్తోంది.