Sabarimala: శబరిమల యాత్రికులకు షాకింగ్ న్యూస్

శబరిమల యాత్రికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది కేరళ ప్రభుత్వం

By Medi Samrat  Published on  13 Oct 2024 7:44 PM IST
Sabarimala: శబరిమల యాత్రికులకు షాకింగ్ న్యూస్

శబరిమల యాత్రికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది కేరళ ప్రభుత్వం. శబరిమల ఆలయం వద్ద స్పాట్ బుకింగ్ ఉండదని కేరళ దేవస్వామ్ మంత్రి విఎన్ వాసవన్ స్పష్టం చేశారు. వార్షిక మండలం-మకరవిళక్కు తీర్థయాత్రల సమయంలో అయ్యప్ప ఆలయానికి వచ్చే భక్తులెవరూ 'దర్శనం' కోల్పోరని హామీ ఇచ్చారు. వర్చువల్ క్యూ సిస్టమ్‌లో, యాత్రికులు శబరిమల ఆలయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దర్శన టిక్కెట్లు, ప్రసాదాలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. స్పాట్ బుకింగ్‌లో యాత్రికులు తమ దర్శనం కోసం స్లాట్‌లను దేవస్వోమ్ బోర్డు గుర్తించిన నిర్దేశిత కేంద్రాలలో బుక్ చేసుకోవచ్చు.

భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కూడా వర్చువల్ క్యూ బుకింగ్‌తో పాటు స్పాట్ బుకింగ్‌ను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులందరికీ సాంకేతికత గురించి తెలియకపోవచ్చునని, ప్రభుత్వం అయ్యప్పల దర్శనాన్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.

శబరిమల ఆలయ బాధ్యతలు చూసుకునే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) ప్రెసిడెంట్, ఆలయానికి వచ్చే యాత్రికులందరికీ అయ్యప్ప స్వామి 'దర్శనం' లభిస్తుందని ఇటీవల హామీ ఇచ్చారని వాసవన్ తెలిపారు. శబరిమల వద్ద స్పాట్ బుకింగ్ అనుమతించకున్నా యాత్రికుల కోసం స్లాట్‌లను బుక్ చేసుకోవడానికి 'ఎడతావలం' (ఆలయానికి వెళ్లే మార్గంలో విశ్రాంతి వేచి ఉండే ప్రదేశాలు) వద్ద అక్షయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. అన్ని ఆచారాలను అనుసరించి తీర్థయాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరికీ దర్శనం లభిస్తుందని వాసవన్ చెప్పారు. భక్తులందరికీ సురక్షితమైన యాత్ర జరిగేలా ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు రోజుకు 80 వేల మంది యాత్రికుల సంఖ్యను నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.


Next Story