బీజేపీ హయాంలో అత్యాచారాలు జరగలేదా.? : సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక రాజధాని బెంగళూరులో గత వారం బాలికపై జరిగిన అత్యాచారం ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది.

By Medi Samrat  Published on  21 Jan 2025 8:38 PM IST
బీజేపీ హయాంలో అత్యాచారాలు జరగలేదా.? : సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక రాజధాని బెంగళూరులో గత వారం బాలికపై జరిగిన అత్యాచారం ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఘటన తర్వాత రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యపై విరుచుకుపడుతోంది. ఈ క్ర‌మంలోనే సీఎం సిద్ధరామయ్య రియాక్షన్ కూడా వెలుగులోకి వచ్చింది. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు లైంగిక వేధింపుల కేసులు నమోదవ్వ లేదా అని సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రిని రాజీనామా చేయాల‌ని బీజేపీ బీజేపీ డిమాండ్ చేస్తుంది.

బెళగావిలో మహాత్మాగాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గౌరవార్థం నిర్వహించిన 'జై బాపు, జై భీమ్‌' ర్యాలీలో సీఎం సిద్ధరామయ్య బీజేపీని టార్గెట్‌ చేస్తూ.. బీజేపీ హయాంలో అత్యాచారాలు జరగలేదా.? అత్యాచారాలు జరగకూడదు, మహిళలకు రక్షణ కల్పించాలి.. అవును, కానీ సమాజంలో ఎప్పుడూ చెడు అంశాలు ఉంటాయి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని అన్నారు.

గత వారం రాష్ట్ర రాజధానిలోని హోయసల నగర్‌లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటన తర్వాత రాష్ట్ర హోంమంత్రి జి. పరమేశ్వర్‌ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. కాంగ్రెస్ హయాంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని బీజేపీ పేర్కొంది.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. కర్ణాటక మాజీ ఆరోగ్య మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వత్ నారాయణ్ ట్విట్టర్‌లో ఇలా వ్రాశారు.. “బెంగళూరు గ్యాంగ్‌రేప్ కేసు.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని పూర్తిగా బహిర్గతం చేసింది. మహిళలకు ఉచిత భద్రత కల్పిస్తామని చెప్పుకునే కాంగ్రెస్‌.. వారికి ప్రాథమిక భద్రత కల్పించడంలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫలమైంది అని వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియా వేదిక X లో కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు R అశోక్ స్పందిస్తూ.. ప్రజలు భయంతో జీవిస్తున్నారని అన్నారు. ఆడపిల్లలు సురక్షితంగా తిరిగే వాతావరణం లేదు. ఇంత నీచమైన పాల‌న‌తో కుర్చీ అంటిపెట్టుకుని ఇంకెంత కాలం ప్రభుత్వాన్ని కొనసాగిస్తావు? మీ పదవికి రాజీనామా చేయండి. ఈ దుష్పరిపాలన, అరాచకాల నుండి రాష్ట్ర ప్రజలను విముక్తి చేయండని వ్యాఖ్యానించారు.

Next Story