మ‌రోసారి షారుక్ ఖాన్‌కు షాక్‌.. ఆర్య‌న్‌కు బెయిల్ నిరాక‌రించిన కోర్టు

No Bail For Aryan Khan In Drugs On Cruise Case.మాద‌క ద్ర‌వ్యాల కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Oct 2021 10:24 AM GMT
మ‌రోసారి షారుక్ ఖాన్‌కు షాక్‌.. ఆర్య‌న్‌కు బెయిల్ నిరాక‌రించిన కోర్టు

మాద‌క ద్ర‌వ్యాల కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌కు మ‌ళ్లీ నిరాశే ఎదురైంది. ముంబ‌యి ప్ర‌త్యేక కోర్టు ఆర్య‌న్ ఖాన్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. అత‌డితో పాటు మ‌రో ఇద్ద‌రికి కూడా బెయిల్ ఇవ్వ‌లేదు. ఈ రోజు విచార‌ణ‌లో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) కోర్టుకు ప‌లు ఆధారాల‌ను స‌మ‌ర్పించింది. ఓ న‌టితో ఆర్య‌న్ మాద‌క‌ద్ర‌వ్యాల గురించి చాటింగ్ చేసిన‌ట్లు ద‌ర్యాప్తులో గుర్తించామ‌ని చెప్పింది. డ్ర‌గ్స్ వికేత్ర‌ల‌తో ఆర్య‌న్ చేసిన చాటింగ్ కు సంబంధించిన వాట్సాప్ చాట్‌ల‌ను కోర్టుకు బుధ‌వారం ఎన్‌సీబీ స‌మ‌ర్పించింది. డ్ర‌గ్స్ విక్రేత‌ల‌కు అత‌డు రెగ్యుల‌ర్ క‌స్ట‌మ‌ర్ అని త‌మ ద‌ర్యాప్తుల్లో తేలిన‌ట్లు వెల్ల‌డించింది.

నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల వాదనతో ఏకీభవించిన ముంబై స్పెషల్ కోర్టు ఆర్యన్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో.. ఈసారి తప్పకుండా బెయిల్ వస్తుందనుకున్న షారుక్‌ కుటుంబం షాక్‌కు గురైంది. ఈ నెల రెండో తేదీన ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ చేసుకుంటూ ఆర్యన్ ఎన్‌సీబీ అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్నంచి ఆర్యన్ జైలులోనే ఉన్నాడు. ఇప్పటికే రెండు సార్లు అతడి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ప్రస్తుతం ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. ఆర్య‌న్ రోజూ ఏడుస్తూనే ఉంటున్నాడ‌ని, స‌రిగ్గా తిండి కూడా తిన‌డం లేద‌ని తెలుస్తోంది ఇక కొడుకు జైలు జీవితం అనుభవిస్తుండటంతో షారుఖ్ దంపతులు బయట కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆర్య‌న్ అరెస్ట్ అయిన‌ప్ప‌టి నుంచి త‌ల్లి గౌరీ ఖాన్ స‌రిగ్గా ఆహారం తీసుకోడం లేద‌ని, నిద్ర‌పోవ‌డం లేద‌ని అంటున్నారు. ఎక్కువ సమయం దైవ ప్రార్థనలోనే ఉంటున్నారని అంటున్నారు.

Next Story
Share it