దూసుకొస్తున్న 'నివర్' తుఫాను
Nivar cyclone effect .. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం ఉదయం మరింతగా బలపడి వాయుగుండంగా
By సుభాష్
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం ఉదయం మరింతగా బలపడి వాయుగుండంగా మారింది. మరికొద్దిసేపట్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫానుకు 'నివర్' అని పేరు పెట్టారు. దాని ప్రభావం రాగల మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధ, గురువారాల్లో దక్షిణకోస్తా, రాయలసీమాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను నవంబర్ 25 మధ్యాహ్నం వరకు కరైకల్, మహాబలిపురం వద్ద తీరం తాకనుందని, ఆ సమయంలో తమిళనాడు తీరంలో కొండచరియలు విరిగిపడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
నివర్ తుఫాను ప్రస్తుతం బెంగాల్ బేలోని పుదుచ్చేరి ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజు ఈ తుఫాను తీవ్రంగా మారే అవకాశం ఉంది. ల్యాండ్‌ఫాల్ సమయంలో గాలి వేగం గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల పరిధిలో ఉండే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 120 కిలోమీటర్ల వరకు తుఫాను తీవ్రమైన తుఫానుగా మారనుందని వెల్లడించింది.
మత్స్యకారులకు హెచ్చరిక
కాగా, నివర్ తుఫాను కారణంగా మత్య్సకారులకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. సముద్రం అలజడిగా ఉంటుందని, మూడు రోజుల పాటు మత్య్స కారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే ఏపీలోని సముద్రతీరం అధికంగా ఉన్న జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని వాతావరణ శాఖ తెలిపింది. రైతాంగం వ్యవసాయ పనులలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికనుజారీ చేశారు. గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో నాలుగో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.