పాము కాటుతో హత్య కొత్త ట్రెండ్..!

New Trend Of Snake Bite Murders Says Supreme Court.ఓ నిందితుడి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిను సుప్రీంకోర్టు కీలక

By అంజి  Published on  7 Oct 2021 3:45 AM GMT
పాము కాటుతో హత్య కొత్త ట్రెండ్..!

ఓ నిందితుడి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిను సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. పాము కాటుతో హత్య చేయించడం సరికొత్త ట్రెండ్‌గా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వివరాల్లోకి వెళ్తే... రాజస్థాన్‌కు చెందిన ఓ పెళ్లైన మహిళ తన ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో తమ వ్యవహారానికి అడ్డుగా ఉన్న అత్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్లాన్‌ ప్రకారం అత్త సుబోధ్‌ దేవిని పాముతో కాటు వేయించి హత్య చేసింది. పాములు పట్టే వ్యక్తి వద్దకు వెళ్లి రూ.10 వేలకు పామును కొని... ఈ హత్యలో ప్రియుడు మనీష్, స్నేహితుడు కృష్ణ కుమార్‌ పాలు పంచుకున్నారు. ఈ ఘటన 2019 జూన్‌ 2న జరిగింది. కాగా తన భార్య మృతిపై అనుమానం వ్యక్తం చేసిన నిందితురాలి మామ రాజేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

ఘటన జరిగిన రోజు నిందితురాలు అల్పానా, ఆమె ప్రియుడు మనీష్ మధ్య 124 సార్లు, అల్పానా కృష్ణకుమార్‌ మధ్య 19 సార్లు నిందితురాలు ఫోన్‌ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితులను 2020 జనవరి 4న పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. కాగా సహా నిందితుడైన కృష్ణకుమార్‌ ఇటీవల బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పాము కాటుతో వ్యక్తులను హత్య చేయించడం కొత్త ట్రెండ్‌గా మారిందని, ఇది ఇప్పుడు రాజస్థాన్‌లో సర్వసాధారణమైందని జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. పామును దేని కోసం కొంటున్నారన్న విషయం తన క్లైంట్‌కు తెలియని సహా నిందితుడైన కృష్ణకుమార్‌ తరఫు లాయర్‌ ఆదిత్య చౌదరి కోర్టుకు తెలిపారు. అలాగే కృష్ణకుమార్‌ చదువుకుంటున్నాడని, తన భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. వాదనల అనంతరం.. నిందితుడు కృష్ణ కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Next Story