చిన్నారుల్లో కరోనా కొత్త లక్షణాలు
New symptoms of the COVID-19 in children.కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో
By తోట వంశీ కుమార్ Published on 13 Jan 2022 11:39 AM ISTకరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో కరోనా మూడో దశ విజృంభిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. చిన్నారులు కూడా ఒమిక్రాన్ వేరియంట్ భారీన పడుతున్నారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒకటి లేదా రెండు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. చిన్నారుల్లో జ్వరం, విరేచనాలతో పాటు కడుపునొప్పి, వాంతులు అవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా కరోనా పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. డెల్టా వేరియంట్‌లో చిన్నారుల్లో కడుపు నొప్పి కనిపించలేదన్నారు. అప్పట్లో వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు గుర్తించామన్నారు.
ఈ లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 5గురు చిన్నారులకు చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరికీ ఆక్సిజన్‌తో చికిత్స అందిస్తున్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పిల్లలకు కోవిడ్ జాగ్రత్తలపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని వైద్యులు తెలిపారు. ఇక 5 ఏళ్ల చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. మాస్క్ పెట్టినప్పటికీ వాటిని వారు కిందకు లాగేస్తుంటారు కనుక ఎక్కువ శాతం వీరు ముప్పు కేటగిరిలో ఉంటారన్నారు. వీరి విషయంలో మరింత అప్రమత్తమంగా ఉండాలన్నారు.