వంటగ్యాస్‌ బుకింగ్‌.. కొత్త రూల్‌

గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ సిలిండర్లు ఉన్నవారికి ఇకపై వెయిటింగ్ పీరియడ్ పెరగనుంది.

By -  అంజి
Published on : 25 March 2026 7:17 AM IST

LPG Booking New Rules, Gas Cylinder Gap, Ujjwala Yojana 45 Days Rule, e-KYC for Gas Connection, Fuel Supply India 2026, LPG Refill OTP Process, Gas Shortage Updates

వంటగ్యాస్‌ బుకింగ్‌.. కొత్త రూల్‌

గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ సిలిండర్లు ఉన్నవారికి ఇకపై వెయిటింగ్ పీరియడ్ పెరగనుంది. హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం సరఫరాపై పడటంతో, గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంది.

ఎవరికి ఎన్ని రోజుల గ్యాప్?

కొత్త నిబంధనల ప్రకారం, ఇంట్లో రెండు సిలిండర్లు ఉన్నవారు ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో దాని కోసం కనీసం 35 రోజులు ఆగాల్సిందే. ఇక ఉజ్వల యోజన లబ్ధిదారులకైతే ఈ గ్యాప్ ఏకంగా 45 రోజులుగా నిర్ణయించారు. అయితే, కేవలం ఒకే ఒక సిలిండర్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రం పాత నిబంధనే వర్తిస్తుంది; వారు 25 రోజుల తర్వాత మరో బుకింగ్ చేసుకోవచ్చు.

బుకింగ్ కావాలంటే 'ప్రశ్నావళి' తప్పనిసరి:

ఏడాదికి కేటాయించిన 12 సిలిండర్ల కోటా పూర్తయిన వారు కొత్తగా బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు యాప్‌లో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఏవైనా శుభకార్యాలు ఉన్నాయా? చుట్టాలు ఎవరైనా వస్తున్నారా? వంటి వివరాలను అందిస్తేనే బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది. అలాగే, డెలివరీ సమయంలో OTP చెప్పడం , ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడం ఇప్పుడు అనివార్యం. కేవైసీ లేని పక్షంలో బుకింగ్ రద్దయ్యే అవకాశం ఉంది.

ఆందోళన వద్దు.. కానీ పొదుపు ముఖ్యం:

ప్రభుత్వం వద్ద పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ నిల్వలు నిండుగా ఉన్నాయని, రిఫైనరీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని పెట్రోలియం శాఖ స్పష్టం చేస్తోంది. కేవలం పుకార్ల వల్ల ప్రజలు ఆందోళనతో ముందస్తుగా నిల్వ చేసుకోవడం వల్లే కొన్ని చోట్ల కొరత కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి అనవసరంగా స్టాక్ పెట్టుకోవద్దని, అధికారిక సమాచారాన్నే నమ్మాలని సూచిస్తున్నారు.

Next Story