హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాలను సవరించిన కేంద్రం.. ఇక 7 రోజులే
New home isolation guidelines for mild asymptomatic Covid-19 cases.స్వల్ప, లక్షణాలు లేని కొవిడ్ బాధితుల
By తోట వంశీ కుమార్
స్వల్ప, లక్షణాలు లేని కొవిడ్ బాధితుల హోం ఐసోలేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటి వరకు 14 రోజులుగా ఉన్న క్వారంటైన్ కాలాన్ని 7 రోజులకు కుదించింది. ఐసోలేషన్ అనంతరం కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేనట్లు వెల్లడించింది. కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత వరుసగా మూడు రోజుల పాటు జ్వరం లేనట్లు అయితే.. ఏడు రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
హోమ్ ఐసోలేషన్‌లో ఎవరు ఉండాలంటే..
కొవిడ్ పాజిటివ్ వచ్చినా ఎలాంటి లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారు. ఆక్సిజన్ స్థాయిలు 93 శాతం కంటే ఎక్కువగా ఉండి, ఎలాంటి జ్వరం లేకపోతే వైద్యుల సూచనతో హోం ఐసోలేషన్‌లో ఉండొచ్చు.
హోమ్ ఐసోలేషన్ కోసం కొత్త మార్గదర్శకాలు ఇవే..
- తేలికపాటి/లక్షణాలు లేని రోగులు కుటుంబ సభ్యులకు దూరంగా ఇంట్లో ఓ ప్రత్యేకమైన గదిలో ఐసోలేట్‌లో ఉండాలి. ఆ గదిలో గాలి, వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి
- ఎల్లప్పుడూ మూడు లేయర్ల మాస్క్‌ను ధరించాలి. ఎనిమిది గంటలకు ఒకసారి మాస్క్‌ను మారుస్తూ ఉండాలి. 72 గంటల తరువాత ఉపయోగించిన మాస్కులను ముక్కలుగా కత్తిరించి పడేయాలి.
- కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లేటప్పుడు ఎన్-95 మాస్క్‌ను ధరించాలి.
- ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడంతో పాటు వీలైనంతంగా విశాంత్రి తీసుకోవాలి
- జ్వరం తగ్గకుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. పారాసిటమాల్ ట్యాబెట్లు వేసుకోవాలి.
- జ్వరం, ఆక్సిజన్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి
-ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులు ఉపయోగించిన వస్తువులను ఇతరులు ఉపయోగించకూడదు
- ఐసోలేషన్‌లోని వ్యక్తులు ముట్టుకున్న వస్తువులను ముట్టుకునేటప్పుడు చేతికి ఖచ్చితంగా గ్లౌజులు ధరించాలి.
- ఏదైన అవసరం అయితే వెంటనే ఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి
Union Health Ministry issues revised guidelines for home isolation of mild/asymptomatic COVID-19 patients pic.twitter.com/5OyCGGM2qh
— ANI (@ANI) January 5, 2022