జైలులో స‌త్యేంద‌ర్ జైన్ భోగాలు.. మ‌రో వీడియో రిలీజ్ చేసిన బీజేపీ

New footage shows Satyendar Jain being served outside food.తీహార్ జైలులో ఉన్న‌ మంత్రి త‌న‌కు నచ్చిన భోజనం చేస్తున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Nov 2022 10:30 AM IST
జైలులో స‌త్యేంద‌ర్ జైన్ భోగాలు.. మ‌రో వీడియో రిలీజ్ చేసిన బీజేపీ

మ‌నీలాండ‌రింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలులో ఉన్న సంగ‌తి తెలిసిందే. జైలులో మంత్రి కాళ్ల‌కు మ‌సాజ్ చేయించుకుంటున్న వీడియోను కొద్ది రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విడుద‌ల చేయ‌గా.. తాజాగా మ‌రో వీడియోను విడుద‌ల చేసింది.

తీహార్ జైలులో ఉన్న‌ మంత్రి.. త‌న‌కు నచ్చిన భోజనం చేస్తున్న వీడియోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా షేర్ చేశారు." రేపిస్టుతో మ‌సాజ్ చేయించుకుని, ఆయ‌న్ను ఫిజియోథెర‌పిస్టు అని పిలిచిన త‌రువాత స‌త్యేంద‌ర్ జైన్ విలాస‌వంత‌మైన భోజ‌నాన్ని చూడ‌వ‌చ్చు. అత‌డు సెల‌వులో రిసార్ట్‌లో ఉన్న‌ట్లు అటెండెట్లు అత‌నికి ఆహారం అందిస్తారు." అంటూ ట్వీట్ చేశారు.

తన మత విశ్వాసాల ప్రకారం తీహార్ జైలులో ఫ్రూట్-సలాడ్ డైట్ చేయాలంటూ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ చేసిన విజ్ఞప్తిపై రూస్ అవెన్యూ కోర్టు తీహార్ జైలు అధికారుల నుండి స్పందన కోరిన ఒక రోజు తర్వాత ఈ వీడియో విడుద‌ల కావ‌డం గ‌మ‌నార్హం

ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలు గదిలో మసాజ్ చేయించుకుంటున్న పాత వీడియోను బీజేపీ శనివారం విడుదల చేసి దుమారం రేపింది. జైన్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చినందుకు తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ సస్పెండ్ చేయబడిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది.

Next Story