రేపటి నుంచే ఫాస్టాగ్‌ కొత్త రూల్స్‌.. చెక్‌ చేసుకోండి

ఫాస్టాగ్‌ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) రేపటి నుంచి కొత్త నిబంధనలను తీసుకొస్తోంది.

By అంజి  Published on  16 Feb 2025 7:41 AM IST
New FASTag rules, NPCI, toll plazas, toll fee

రేపటి నుంచే ఫాస్టాగ్‌ కొత్త రూల్స్‌.. చెక్‌ చేసుకోండి

మీ FASTag రీఛార్జ్ చేయడం మర్చిపోయారా? ఫాస్టాగ్‌ అకౌంట్‌ సమస్యను పరిష్కరించుకోలేదా? అయితే వెంటనే సరి చేసుకోండి. లేదంటే భారీ జరిమానా కట్టాల్సి వస్తుంది. ఫాస్టాగ్‌ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) రేపటి నుంచి కొత్త నిబంధనలను తీసుకొస్తోంది. బ్లాక్‌ లిస్టులో ఉన్న ఫాస్టాగ్‌ యూజర్లు టోల్‌ ప్లాజాకు వచ్చే 70 నిమిషాల్లోపు ఆ లిస్టు నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో రెండింతల ఛార్జి చెల్లించాల్సి వస్తుంది.

వాహనం టోల్‌ బూత్‌కు చేరడానికి ముందు 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్టాగ్‌ బ్లాక్‌లిస్ట్‌ అయి ఉన్నా, హాట్‌లిస్ట్‌లో ఉన్నా, బ్యాలెన్స్‌ తక్కువగా ఉన్నా టోల్‌ బూత్‌ వద్ద ఫాస్టాగ్‌ లావాదేవీ విఫలమవుతుంది. టోల్‌ బూత్‌ వద్ద స్కాన్‌ చేసిన 10 నిమిషాల వరకు ఫాస్టాగ్‌ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నా, ఇన్‌యాక్టివ్‌గా ఉన్నా లావాదేవీ తిరస్కరణకు గురవుతుంది. ఈ రెండు సందర్భాల్లో 176 ఎర్రర్‌ కోడ్‌తో లావాదేవీ విఫలమవుతుంది. వాహనానికి జరిమానా కింద రెట్టింపు టోల్‌ చార్జ్‌ పడుతుంది.

కేవైసీ అసంపూర్తిగా ఉన్నా, తగిన బ్యాలెన్స్‌ లేకపోయినా ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్‌ అవుతుంది. కాబట్టి బయలుదేరే ముందుగానే ఫాస్టాగ్‌ సరిచూసుకోవడం మంచిది. తగినంత బ్యాలెన్స్ లేకపోయినా, కేవైసీ ధృవీకరణ పెండింగ్‌లో ఉన్నా, వాహన రిజిస్ట్రేషన్ వివరాలలో వ్యత్యాసాలు ఉన్నా ఫాస్టాగ్‌ బ్లాక్‌ లిస్టులోకి వెళ్తుంది.

Next Story