కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే భయటపడుతున్నాం. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో ఆయా రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియను మొదలుపెడుతున్నాయి. ఇక ఈ మహమ్మారిని నుంచి కోలుకున్నట్లే అని బావిస్తున్న తరుణంలో మళ్లీ కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ మహిళకు నూతన వేరియంట్ కోవిడ్ సోకినట్లు ఆరాష్ట్ర వైద్య విద్య మంత్రి విశ్వస్ సారంగ్ ధ్రువీకరించారు
ఎన్‌సిడిసి (నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) యొక్క నివేదికలో నూతన వేరియంట్ ను పేర్కొన్నట్లు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నూతన వేరియంట్ కరోనా వైరస్ సోకిన మహిళ కోవిడ్ టీకా తీసుకున్నట్లు చెప్పారు. మహిళకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని, ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు