కాంగ్రెస్సేతర వ్యక్తి ప్రధానిగా ఉంటే జీర్ణించుకోలేకపోతున్నారు: ప్రధాని మోదీ

ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on  2 July 2024 1:30 PM IST
nda, parliamentary meeting, pm modi, instruction,

 కాంగ్రెస్సేతర వ్యక్తి ప్రధానిగా ఉంటే జీర్ణించుకోలేకపోతున్నారు: ప్రధాని మోదీ

ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలకు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్సేతర నేత వరుసగా మూడుసార్లు ఇతర పార్టీ వారు ప్రధానిగా ఎన్నికవ్వడం హస్తం పార్టీ జీర్ణించుకోలేకపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్‌గాంధీ సభలో అవమానకరంగా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. రాహుల్‌ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దంటూ ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. విధివిధానాలను తప్పకుండా పాటించాలని చెప్పారు. ప్రధాని మోదీ మాట్లాడిన విషయాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు మీడియాకు వెల్లడించారు.

కొత్తగా ఎన్నిక అయిన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ ఎంపీలకు సూచించారని చెప్పారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. నిన్న పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత ప్రవర్తించిన తీరు అమర్యాదకంగా ఉందని చెప్పారు. స్పీకర్ స్థానాన్ని రాహుల్‌గాంధీ అవమానించారని అన్నారు. ఆయనలా ఎన్డీఏ సభ్యుల ఎవరూ ప్రవర్తించొద్దని చెప్పారు. కొన్ని దశాబ్దాల పాటు ప్రధాని కుర్చీని ఓ కుటుంబం తన గుప్పిట్లో పెట్టుకుందనీ.. కానీ తమ ప్రభుత్వం దేశ నేతలందరికీ సమాన గౌరవం ఇస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతీ ఎంపీ తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాన మంత్రి సంగ్రహాలయ‌ ను సందర్శించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో చెప్పారు. . వారి జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలని ప్రధాని మోదీ సూచించారని కిరణ్ రిజిజు తెలిపారు.

ఎంపీలు మాట్లాడాలని అనుకున్న విషయంపై ముందుగానే అధ్యయనం చేయాలని చెప్పారు. మీడియా ముందుకు వచ్చి అనసవర వ్యాఖ్యలు చేయొద్దని ప్రధాని హెచ్చరించారన్నారు.

Next Story