షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్‌సీబీ క్లీన్‌చిట్‌

NCB gives clean chit to Aryan Khan in drugs on cruise case.బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్ కు ఊర‌ట

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2022 2:21 PM IST
షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్‌సీబీ క్లీన్‌చిట్‌

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్ కు ఊర‌ట ల‌భించింది. క్రూజ్ నౌక డ్ర‌గ్స్ కేసు విష‌యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అత‌డికి క్లీన్ చిట్ ఇచ్చింది. అత‌ను అమాయ‌కుడ‌ని, అత‌నిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని తెలిపింది. కోర్టుకు ఎన్‌సీబీ స‌మ‌ర్పించిన చార్జ్‌షీట్‌లో ఆర్య‌న్ పేరు లేదు. కాగా.. అత‌డికి వ్య‌తిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు ల‌భించ‌క‌పోవ‌డంతో క్లీన్ చిట్ ఇచ్చిన‌ట్లు సీనియ‌ర్ ఎన్‌సీబీ అధికారి ఒక‌రు తెలిపారు.

ముంబై తీరంలో అక్టోబ‌ర్ 3,2021 న ఓ క్రూజ్ నౌక‌లో ఎన్‌సీబీ ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించ‌గా ఆర్య‌న్ ఖాన్ అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత ఆర్య‌న్ ను కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా అత‌డికి జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విదించింది. ఈ కేసులో ముంబైలోని ఆర్థ‌ర్ రోడ్ జైలులో 28 రోజుల పాటు ఉన్న‌ ఆర్య‌న్ కు ఎట్ట‌కేల‌కు బెయిల్ ల‌భించ‌డంతో అక్టోబ‌ర్ 30న విడుద‌ల కాగా.. తాజాగా ఈ కేసు నుంచి కూడా విముక్తి లభించింది.

Next Story