'వడగాలులను వాతావరణ విపత్తుగా ప్రకటించి, కార్మికులకు విపత్తు భత్యం అందించాలి'.. ఎన్‌ఏపీఎమ్ డిమాండ్
వడగాల్పులను వాతావరణ విపత్తుగా ప్రకటించి, ఆర్థికంగా ప్రభావితమైన కార్మికులకు విపత్తు భత్యం అందించాలని ఎన్‌ఏపీఎమ్ డిమాండ్ చేసింది.
By అంజి Published on 22 May 2024 1:36 PM GMT'వడగాలులను వాతావరణ విపత్తుగా ప్రకటించి, కార్మికులకు విపత్తు భత్యం అందించాలి'.. ఎన్‌ఏపీఎమ్ డిమాండ్
విపరీతమైన వేడి, వడగాల్పుల మధ్య బయట ఎండలో లక్షలాది మంది పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే అవుట్ డోర్ కార్మికులను రక్షించడానికి తక్షణ ప్రభుత్వ చర్యను ఎన్ఎపిఎమ్ డిమాండ్ చేసింది. వడగాల్పులను వాతావరణ విపత్తుగా ప్రకటించి, ఆర్థికంగా ప్రభావితమైన కార్మికులకు విపత్తు భత్యం అందించాలని డిమాండ్ చేసింది.
భారతదేశం అంతటా 'ఎన్నికల వేడి' పట్టుకుంది. ఇది మనందరి కంటికీ సరిగ్గా కనిపిస్తుంది. ఏదేమైనా, పౌరులను, ముఖ్యంగా కోట్ల మంది బహిరంగ కార్మికులను ప్రభావితం చేసే మరొక వేడి ఉంది. మండే ఎండల్లో కూడా గ్రామాలు, నగరాలకు ఆహారం అందిస్తూ, నిర్మాణ రంగంలో పని చేస్తూ, సేవ చేసే గ్రామీణ, పట్టణ భారత దేశమంతటి నుండి వస్తున్న శ్రమజీవుల ఆందోళనలు 'ప్రధాన స్రవంతి వాతావరణ న్యాయం, విధాన చర్చల్లో ఇంకా తగినంతగా ప్రాతినిధ్యం పొందుకోలేకపోతున్నాయని ఎన్‌ఏపీఎమ్ (నేషనల్ అలయన్స్ ఆఫ్ పిపుల్స్ మూవ్‌మెంట్స్) పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఏపీఎమ్ దీనిని ఒక ముఖ్యమైన సమస్యగా హైలైట్ చేసింది. ఇది అధికారులు, సమాజం నుండి తక్షణ చర్యకు అర్హమైన సమస్య అని పేర్కొంది.
ప్రతి సంవత్సరం కనీసం 70% మంది కార్మికులు అధిక వేడికి గురవుతున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ హెచ్చరిస్తోంది. 2000 నుండి 2020 వరకు అధిక వేడికి గురయ్యే కార్మికులలో కనీసం మూడింట ఒక వంతు మంది పెరిగారు. గ్లోబల్ వార్మింగ్ (భూ శీతోష్ణ స్థితి మార్పు) తో పాటు శ్రామిక శక్తిలో ఎక్కువ సంఖ్యలో కార్మికులు చేరడం ఈ పెరుగుదలకు కారణం. భారతదేశం పెద్ద సంఖ్యలో అసంఘటిత, బహిరంగ కార్మికులకు నిలయంగా ఉంది. ఈ సంవత్సరం తీవ్రమైన వేడి ఒత్తిడి, మన కార్మికులు వారి ఆరోగ్యం, ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. 2023 ప్రథమార్ధంలో వడదెబ్బకు 252 మంది చనిపోయారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తీవ్రమైన ఎండట కారణంగా ఈ ఏడాది ఈ సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
''వ్యవసాయ కార్మికులు, నరేగా కార్మికులు గ్రామీణ కార్మికులు అతి ఎక్కువగా ఈ వేడికి సంబంధించిన దుష్ప్రభావానికి ప్రభావితమవుతున్నారు. వీరి తర్వాత నిర్మాణ కార్మికులు ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో వేడికి గురయ్యే రెండవ అత్యంత బలహీనమైన వర్గం మానవ కార్యకలాపాల కారణంగా నగరాల్లో స్థానికంగా ఏర్పడే అధిక వేడి అయిన 'హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ పట్టణ అవుట్ డోర్ వర్కర్ల కష్టాలను మరింత పెంచుతోంది. మైనింగ్ కార్మికులు, రోజువారీ వేతన కార్మికులు, రవాణా కార్మికులు, గిగ్ కార్మికులు, వీధి వ్యాపారులు మరిశుద్ధ్య కార్మికులు వ్యర్థాలు సేకరించే కార్మికులు హమాలీ కార్మికులు, మత్స్యకారులు, సాల్ట్ పాన్ కార్మికులు మొదలైన వారు వడదెబ్బకు ఎక్కువగా గురవుతారు. సరైన వెంటిలేషన్ , శీతలీకరణ లేని ప్రదేశాలలో పనిచేసే ఇండోర్ కార్మికులు కూడా వేడి ఒత్తిడికి సమానంగా గురవుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల, చిన్న కర్మాగార కార్మికులు, ఇంటి ఆధారిత కార్మికులు, ఇంటి పని మనుషులు కూడా అధిక వేడి ప్రభావానికి గురవుతారు. పనిలో లేదా ఇంట్లో ఎక్కువ పరిమితమైన, మూసివేసిన ప్రదేశాలలో పనిచేయడం వల్ల పురుషుల కంటే మహిళా కార్మికులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. దళిత, బహుజన, ఆదివాసీ, విముక్త, మైనారిటీ ప్రజలతో సహా సామాజికంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు'' అని ఎన్‌ఏపీఎమ్ తెలిపింది.
వాతావరణ మార్పుల చర్యలో కార్మికులు, పని ప్రదేశాలు కేంద్రంగా ఉండాలని ఐఎల్ ఓ సిఫార్సు చేసింది. ముఖ్యంగా హీట్ యాక్షన్ ప్లాన్ల కార్మికుల భద్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి. అంతేకాకుండా, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యంపై చట్టం కూడా అత్యవసరమైన అంశంగా వాతావరణ మార్పు ప్రమాదాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలి, అయితే, వాతావరణ మార్పులు, హీట్ యాక్షన్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యంపై భారత విధానాల్లో ఇవి లేవు. తలాగే, జాతీయ విపత్తు నిర్వహణ విధానం, కార్యాచరణ ప్రణాళికలో వడగాల్పులను గుర్తించినప్పుటికీ, ఈ ఏడాది విపరీతమైన వడగాల్పులను విపత్తు పరిస్థితిగా ప్రభుత్వం ప్రకటించలేదు. ఇది కార్మికులకు ఎటువంటి సహాయం లేకుండా చేస్తోంది. ఈ రక్షణల గురించి కార్మికులకు మరింత భరోసా ఉన్నప్పుడు, ఆదాయం లేదా జీవనోపాధిని కోల్పోతామనే భయం లేనప్పుడు వారు అధిక వేడికి గురికాకుండా తమను తాము రక్షించుకోగలుగుతారని ఐఎస్ఓ వివరిస్తుంది.
ఈ అధిక వేడిని ఎదుర్కొనే ప్రభుత్వ విధానాలలో, వాటి చర్చా నిర్ణయాలలో భారతదేశం యొక్క అసంఘటిత కార్మికుల మినహాయింపును నేషనల్ అలయన్స్ ఆఫ్ పిపుల్స్ మూవ్‌మెంట్స్ తీవ్రంగా ఖండిస్తుంది.
''అధిక వేడి బహిర్గతం కారణంగా, దీర్ఘకాలికంగా అధిక ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొనే అసంఘటిత, బహిరంగ కార్మికుల పరిస్థితుల గురించి తీవ్రంగా అందోళన చెందుతున్నాము. వారికి తగిన రక్షణ, ఉపశమనం కలిగించే పాలసీల నుంచి వారిని పూర్తిగా మినహాయించడం వారి బలహీనతను పెంచుతుంది. వాతావరణ చర్యలకు సంబంధించిన సంబంధిత విధానాలు, ఎజెండాపై చర్చలు, చర్చల్లో కార్మికుల ఆందోళనలు, స్వరాలు పూర్తిగా కనిపించడం లేదు. భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఈ సంక్షోభాన్ని తక్షణమే గుర్తించి, సమర్థవంతమైన చర్యల ద్వారా, తమ డిమాండ్లను వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరుతున్నాము'' అని ఎన్‌ఏపీఎమ్ పేర్కొంది.