ప్రబలుతోన్న మర్మమైన వ్యాధి.. ఇప్పటికే 17 మంది మృతి.. కనిపెట్టలేక తలలు పట్టుకుంటున్న అధికారులు

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని బాదల్ గ్రామంలో తెలియని మర్మమైన వ్యాధి ప్రబలుతోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 17 మంది మరణించారు.

By అంజి  Published on  21 Jan 2025 12:00 PM IST
Mysterious illness, Jammu Kashmir,  Badhal village, Rajouri district

ప్రబలుతోన్న మర్మమైన వ్యాధి.. ఇప్పటికే 17 మంది మృతి.. కనిపెట్టలేక తలలు పట్టుకుంటున్న అధికారులు

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని బాదల్ గ్రామంలో తెలియని మర్మమైన వ్యాధి ప్రబలుతోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 17 మంది మరణించారు. మరణాలకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. గత ఏడాది డిసెంబర్ 7న తొలిసారిగా బయటపడిన మర్మమైన వ్యాధి/అనారోగ్యం అధికారులకు పెద్ద సవాలుగా మిగిలిపోయింది. డిసెంబర్ 7న, బాధాల్ గ్రామంలో తెలియని కారణాలతో ఐదుగురు మరణాలు నమోదయ్యాయి. ఈ వ్యాధికి అత్యంత ప్రభావితమైన కుటుంబంగా మహ్మద్ అస్లాం కుటుంబం ఉంది. తల్లిదండ్రులు, మొత్తం 6 మంది పిల్లలతో సహా 8 మంది కుటుంబ సభ్యులను మహ్మద్ అస్లాం కోల్పోయారు.

శనివారం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరణాలపై దర్యాప్తు చేయడానికి 11 మంది సభ్యులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఉన్నత స్థాయి బృందం ఆదివారం (జనవరి 19) రాజౌరి జిల్లాకు చేరుకోగా, యస్మీన్ అనే మైనర్ బాలిక వ్యాధి బారిన పడి SMGS హాస్పిటల్‌లో (జమ్మూ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రి) మరణించడంతో మృతుల సంఖ్య 17కి చేరుకుంది. బాధితురాలు గత కొన్ని రోజులుగా ప్రాణాలతో పోరాడుతుండగా, ఆసుపత్రిలో వెంటిలేటర్‌ను ఉంచారు.

అయితే ఆదివారం సాయంత్రం ఆమె కన్నుమూసింది. ప్రత్యేక బృందం రాజౌరిలో ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. ఇందులో అధికారులు సంక్షోభం గురించి బృందానికి వివరించారు. సోమవారం కూడా బృందం బాధిత గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించింది. ఈ మర్మమైన మరణాలను కూడా జమ్ము కశ్మీర్‌ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారించడంతోపాటు వారి మొబైల్‌ ఫోన్లను స్కానింగ్‌ చేసి నేరపూరిత కుట్ర కోణంపై సిట్‌ దర్యాప్తు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో పెద్దగా పురోగతి లేదు .

"J&K అడ్మినిస్ట్రేషన్ యొక్క ఆరోగ్యం, ఇతర విభాగాలు ఈ విషయంలో విచారణ నిర్వహించాయి. కానీ వాస్తవాలు ఇంకా నిర్ధారించబడలేదు. గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి అంతర్-మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు రాజౌరికి చేరుకున్నారు. నేను భావిస్తున్నాను, త్వరలో కారణాలు ఈ కేసుకు సంబంధించి ఇతర కోణాల్లో దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు’’ అని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మీడియాతో అన్నారు.

జమ్ము కశ్మీర్‌ డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి కూడా శనివారం బాదల్ గ్రామానికి వెళ్లి అనుమానాస్పద అనారోగ్యం కారణంగా బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ మరణాలకు గల కారణాలను వెలికితీసేందుకు ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఈ వ్యవహారంలో ఏదైనా నేరపూరిత కుట్ర జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే, పీజీఐ చండీగఢ్, ఎయిమ్స్ ఢిల్లీ సహా ప్రముఖ వైద్య సంస్థల నిపుణులు ఇప్పటికే రాజౌరీలోని బాధిత గ్రామాన్ని సందర్శించి నమూనాలను సేకరించారు. నిపుణులు నిర్వహించిన పరీక్షలు, అధ్యయనం ఆధారంగా, బాధితులలో కొన్ని న్యూరోటాక్సిన్లు కనుగొనబడ్డాయి. అయినప్పటికీ, వైరల్ లేదా బ్యాక్టీరియా సంక్రమణ కనుగొనబడలేదు. బాధిత వ్యక్తుల లక్షణాలు జ్వరం, చెమటలు.

Next Story