జమ్ము విమానాశ్రయంలో పేలుడు.. ఓ ఉగ్రవాది అరెస్టు.. హై అలర్ట్
Mysterious Blast in Air force station.జమ్ముకశ్మీర్‌లోని జమ్ము విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున బాంబు
By తోట వంశీ కుమార్ Published on
27 Jun 2021 3:44 AM GMT

జమ్ముకశ్మీర్‌లోని జమ్ము విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున బాంబు పేలడంతో కలకలం రేగింది. విమానాశ్రయం లోపల ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడం తో అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. తెల్లవారుజామున 1.50 గంటల ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ లో ని టెక్నికల్ ఏరియాలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఘటన అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ఫోరెన్సిక్ నిపుణులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు డిస్పోజల్ టీమ్ కూడా చేరుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉంటే.. ఓ ఉగ్రవాదిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. నర్వాల్ ఏరియాలో తీవ్రవాది అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఐదు కేజీల ఎల్ఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తీవ్రవాదిని పోలీసులు విచారిస్తున్నారు. ఐదు కేజీల ఎల్ఈడీ తో ఉగ్రవాదులు పేలుళ్లకు ఏమైనా పథకం రచించారా అన్నదానిపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్ మొత్తం ఒక్కసారిగా హై అలర్ట్ అయింది.
Next Story