ట్రైన్ కింద ప‌డ‌బోయిన చిన్నారిని కాపాడిన రైల్వే పోలీసు.. వీడియో

Mumbai Railway Cop Saves Child Who Fell Off Moving Train.త‌ల్లి చేతుల్లోంచి జారీ క‌దులుతున్నలోక‌ల్ ట్రైన్ కింద ప‌డ‌బోయిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Nov 2022 2:42 PM IST
ట్రైన్ కింద ప‌డ‌బోయిన చిన్నారిని కాపాడిన రైల్వే పోలీసు.. వీడియో

త‌ల్లి చేతుల్లోంచి జారీ క‌దులుతున్న లోక‌ల్ ట్రైన్ కింద ప‌డ‌బోయిన ఓ చిన్నారిని రైల్వే పోలీసులు కాపాడారు. ఈ ఘ‌ట‌న ముంబైలో జ‌రిగింది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. చిన్నారిని ఎత్తుకుని ఓ మ‌హిళ మంగళవారం మధ్యాహ్నం మన్‌కుర్ద్‌ రైల్వే స్టేషన్‌లోని రెండ‌వ ప్లాట్‌ఫాం కి వ‌చ్చింది. లోక‌ల్ ట్రైన్ ఎక్కింది. అయితే.. ప్ర‌యాణీకుల ర‌ద్దీ కార‌ణంగా రైలు క‌దుతున్న స‌మ‌యంలో ప‌ట్టు కోల్పోయింది. ఆమె చేతిలోంచి చిన్నారి జారీ ట్రైన్ కింద ప‌డ‌బోయింది.

అక్క‌డే విధులు నిర్వ‌ర్తిస్తున్న రైల్వే పోలీసు అక్ష‌య్ సోయ గ‌మ‌నించాడు. స‌కాలంలో స్పందించి చిన్నారిని రైలు కింద ప‌డ‌కుండా కాపాడాడు. చిన్నారి కింద ప‌డిపోవ‌డంతో మ‌హిళ కూడా రైలు దిగేందుకు య‌త్నించి ప‌ట్టుత‌ప్ప‌గా ప్లాట్‌ఫాం ఉన్న ప్ర‌యాణీకులు కాపాడారు. ఈఘ‌ట‌న మొత్తం అక్క‌డే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌గా.. నెటీజ‌న్లు అక్ష‌య్ సాహ‌సాన్ని మెచ్చుకుంటున్నారు.

Next Story