6 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. 90 నిమిషాల్లో కనుగొన్న స్నిఫర్‌ డాగ్‌

ముంబై పోలీసుల బాంబు నిర్వీర్యం, డిటెక్షన్ స్క్వాడ్‌కు చెందిన స్నిఫర్ డాగ్ కేవలం 90 నిమిషాల్లో కిడ్నాప్ చేయబడిన ఆరేళ్ల చిన్నారిని గుర్తించింది.

By అంజి  Published on  2 Dec 2023 1:31 AM GMT
Mumbai police, sniffer dog Leo, missing child

6 ఏళ్ల చిన్నారి కిడ్నాప్.. 90 నిమిషాల్లో కనుగొన్న స్నిఫర్‌ డాగ్‌

ముంబై పోలీసుల బాంబు నిర్వీర్యం, డిటెక్షన్ స్క్వాడ్‌కు చెందిన స్నిఫర్ డాగ్ కేవలం 90 నిమిషాల్లో కిడ్నాప్ చేయబడిన ఆరేళ్ల చిన్నారిని గుర్తించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని సబర్బన్ అంధేరి (తూర్పు) ప్రాంతంలోని అశోక్ నగర్ మురికివాడలో తన ఇంటికి 500 మీటర్ల దూరంలో కిడ్నాప్ చేయబడిన బాలుడిని డాబర్‌మ్యాన్ అనే లియో అనే కుక్క గుర్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 23న ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటూ చిన్నారి కనిపించకుండా పోయింది.

ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చిన్నారి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు తమ నివాసానికి సమీపంలో ఉన్న పోవై పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోవాయ్ పోలీసులు ఓ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మురికివాడగా ఉన్న ఆ ప్రాంతంలో సీసీటీవీ కవరేజీ లేకపోవడంతో శోధన సవాలుగా మారింది. అయితే, పోవై పోలీసులు సాంకేతిక వనరులు, రహస్య ఇన్‌ఫార్మర్లు, స్థానిక నివాసితుల సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు.

చిన్నారి ఆడుకోవడానికి బయటకు వెళ్లే ముందు బట్టలు మార్చుకున్నాడని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. దీంతో తప్పిపోయిన చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. పోలీసులు స్నిఫర్‌ డాగ్‌ లియోను తీసుకొచ్చి పసిగట్టేందుకు బాలుడి టీషర్ట్ ఇచ్చారు. బాలుడి టీ-షర్టును పసిగట్టిన తర్వాత, లియో తన వేట ప్రారంభించి, సమీపంలోని భవనంలో బాలుడిని గుర్తించాడు. గుర్తుతెలియని కిడ్నాపర్లను పట్టుకునేందుకు ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story