స్కూటీపై ఏడుగురు చిన్నారులతో రైడ్.. వీడియో వైరల్‌ కావడంతో వ్యక్తి అరెస్ట్

ఓ వ్యక్తి తనతో పాటు మరో ఏడుగురు పిల్లల్ని స్కూటీపై ఎక్కించుకుని సోషల్‌ మీడియా వార్తల్లో నిలిచాడు.

By అంజి  Published on  27 Jun 2023 3:39 PM IST
Mumbai man, Mumbai Traffic Police, Scooty ride

స్కూటీపై ఏడుగురు చిన్నారులతో రైడ్.. వీడియో వైరల్‌ కావడంతో వ్యక్తి అరెస్ట్

సాధారణంగా స్కూటీపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలు కాదు. మహా అయితే ముగ్గురు. అది కూడా దగ్గర దగ్గర కూర్చుంటేనే ముగ్గురు స్కూటీపై ప్రయాణించొచ్చు. ఇక ట్రాఫిక్ రూల్స్‌ ప్రకారమైతే ఇద్దరు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అయితే అందుకు విరుద్ధంగా ఓ వ్యక్తి తనతో పాటు మరో ఏడుగురు పిల్లల్ని స్కూటీపై ఎక్కించుకుని సోషల్‌ మీడియా వార్తల్లో నిలిచాడు. ముంబైకి చెందిన 39 ఏళ్ల మున్వర్ షా స్థానికంగా కొబ్బరికాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఇటీవలే ఆ వ్యక్తి ఏకంగా ఏడుగురు పిల్లలతో స్కూటీపై ప్రయాణించాడు.

వీడియోలో మున్వర్ షా బైక్ నడుపుతూ కనిపించాడు. ఇద్దరు పిల్లలు స్కూటీ ముందు భాగంలో నిలబడి కనిపించారు. మరో ముగ్గురు వెనుక కూర్చోని కనిపించారు. మరో ఇద్దరు వాహనం క్రాష్ గార్డ్ పై ప్రమాదకరంగా నిలబడి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియో వైరల్‌గా మారడంతో పోలీసుల దృష్టికి చేరింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మున్వర్ షాను అరెస్ట్ చేశారు. అతని బైక్‌ని సీజ్ చేశారు. వీడియోలో కనిపిస్తున్న ఏడుగురిలో నలుగురు మునవ్వర్ షా పిల్లలు కాగా, మిగిలిన వారు పొరుగువారి పిల్లలు.

Next Story