తాడు నిచ్చెనలో ఇరుక్కున్న మెడ.. ఏడేళ్ల చిన్నారి మృతి

ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన ఇంట్లో తన తోబుట్టువులతో ఆడుకుంటూ ఏడేళ్ల బాలిక తాడు నిచ్చెనలో చిక్కుకుని మృతి చెందింది.

By అంజి
Published on : 31 July 2024 10:00 AM IST

Mumbai,rope ladder, Shivaji Nagar

తాడు నిచ్చెనలో ఇరుక్కున్న మెడ.. ఏడేళ్ల చిన్నారి మృతి

ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన ఇంట్లో తన తోబుట్టువులతో ఆడుకుంటూ ఏడేళ్ల బాలిక తాడు నిచ్చెనలో చిక్కుకుని మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఆదివారం నాడు శివాజీ నగర్‌లోని ఓ టెన్‌మెంట్‌లో ఈ ఘటన జరిగిందని ఓ అధికారి తెలిపారు. అకృతి సింగ్ ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులు లేని సమయంలో తన తోబుట్టువులు, స్నేహితుడితో దాగుడుమూతలు ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది.

చిన్నారి మెడకు తాడు నిచ్చెన చిక్కుకుందని పోలీసు అధికారి తెలిపారు. ఆమె అక్క సహాయం కోసం పిలిచింది, ఆ తర్వాత ఇరుగుపొరుగు వారు చిన్నారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, కానీ ఆమె చికిత్స పొందేలోపే మరణించిందని అధికారి తెలిపారు. ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Next Story