పరువు నష్టం కేసు.. సంజయ్ రౌత్‌కు 15 రోజుల జైలు శిక్ష

బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధా సోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రాజ్యసభ ఎంపీ, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్‌కు ముంబై కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించింది.

By అంజి
Published on : 26 Sept 2024 1:39 PM IST

Mumbai court, Sanjay Raut, imprisonment , defamation case

పరువు నష్టం కేసు.. సంజయ్ రౌత్‌కు 15 రోజుల జైలు శిక్ష 

బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధా సోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రాజ్యసభ ఎంపీ, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్‌కు ముంబై కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించింది. ముంబైలోని రుయా కాలేజీకి చెందిన ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ మేధా సోమయ్య తన ఫిర్యాదులో రౌత్ తనపై, తన భర్తపై నిరాధారమైన, పూర్తిగా పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేశారని తెలిపారు. తాను, తన ఎన్జీవో యువ ప్రతిష్ఠాన్‌తో కలిసి రూ. 100 కోట్ల మరుగుదొడ్ల కుంభకోణంలో తన ప్రమేయం ఉందని శివసేన (యుబిటి) ఎంపి చేసిన ఆరోపణలపై ఆమె చర్యలు తీసుకోవాలని కోరింది.

పరువు నష్టం కోసం భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 500 కింద రౌత్ దోషిగా నిర్ధారించబడ్డారు. అతడికి కోర్టు 15 రోజుల సాధారణ జైలు శిక్ష విధించబడింది. రూ.25 వేల జరిమానా కూడా విధించింది. న్యాయవాది వివేకానంద్ గుప్తా ద్వారా దాఖలు చేసిన మేధా సోమయ్య ఫిర్యాదులో, ఏప్రిల్ 2022 నుండి, రౌత్ తనకు వ్యతిరేకంగా మీడియాకు "హానికరమైన, అసమంజసమైన దుర్మార్గపు ప్రకటనలు" ఇచ్చారని, అది ముద్రించబడి, ప్రచురించబడి, ఎలక్ట్రానిక్, ప్రింట్ ద్వారా ప్రజలకు పంపిణీ చేయబడిందని పేర్కొన్నారు.

రౌత్ తరపు న్యాయవాది, అతని సోదరుడు సునీల్ రౌత్ మాట్లాడుతూ తాము బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని, ఈ ఉత్తర్వులపై ముంబై సెషన్స్ కోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పారు.

Next Story