వాళ్లు మహిళలు కాదు.. సెక్స్‌ వర్కర్లు.. నెట్టింట దుమారం రేపుతున్న నటుడి వ్యాఖ్యలు

Mukesh khannas recent comments against women have not gone down well. మహిళలపై శక్తిమాన్‌ నటుడు ముఖేష్‌ ఖన్నా చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి.

By అంజి  Published on  10 Aug 2022 2:21 PM IST
వాళ్లు మహిళలు కాదు.. సెక్స్‌ వర్కర్లు.. నెట్టింట దుమారం రేపుతున్న నటుడి వ్యాఖ్యలు

మహిళలపై శక్తిమాన్‌ నటుడు ముఖేష్‌ ఖన్నా చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. ముఖేష్‌ కన్నా సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ నడుతుపుతున్నాడు. భీస్మ్ ఇంటర్నేషనల్ ఛానెల్‌లో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన లేటెస్ట్‌ వీడియోలో సెక్స్‌ కోసం యువకులను ఆకర్షించే మహిళల క్యారెక్టర్‌ను తప్పుపడుతూ కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు. లైంగిక వాంఛ‌లు తీర్చాల‌ని పురుషుడిని కోరేవారు మ‌హిళ‌లు కాద‌ని వారు సెక్స్ వ‌ర్క‌ర్ల‌ని ముఖేష్ ఖ‌న్నా వ్యాఖ్యానించారు.

నాగరికత సమాజాంలో మంచిగా పెరిగిన మహిళలు ఎవ‌రూ లైంగిక కోరికలు తీర్చాల‌ని యువ‌కులను కోరరని వీడియోలో ముఖేష్ ఖ‌న్నా పేర్కొన్నారు. నెట్టింట వ‌ల‌ వేసే యువతుల ప‌ట్ల మగవారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వ్యాఖ్యానించారు. అమాయ‌క పురుషులే ల‌క్ష్యంగా కొంద‌రు మ‌హిళ‌లు రాకెట్లు న‌డిపి బ్లాక్‌మెయిల్ చేస్తున్నార‌ని హెచ్చ‌రించారు. కొందరు మహిళలు.. వారి నగ్న చిత్రాలను పంపి యువకులను బెదిరిస్తున్నారని అన్నారు. మ‌రోవైపు మ‌హిళ‌లు కూడా ప‌రిమితుల్లో ఉండాల‌ని సూచించారు. సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్ల‌ను గౌర‌వించాల‌ని అన్నారు.

ఈ విషయంలో.. తన పూర్వపు రోజుల్లో నో చెప్పే హక్కు మహిళలకు ఉండేదని, కానీ ఇప్పుడు మగవాళ్లే నో చెప్తున్నారని అన్నారు. ఇక తనకు ఉచిత సెక్స్‌ ఆఫర్‌ చేస్తున్న యువతుల సోషల్‌ మీడియా ఖాతాల నుంచి మెసేజ్‌లు వచ్చినట్లు చెప్పాడు. ఇక ముఖేష్ ఖ‌న్నా వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు ఫైర్‌ అవుతున్నారు. ముఖేష్ ఖ‌న్నా వ్యాఖ్య‌లపై స్పందిస్తూ.. ఆయన ఓ సెక్సిస్ట్ అని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Next Story