కరోనాతో మరో ఎంపీ కన్నుమూత

MP Abhay Bhardwaj passes away due to Covid19 .. కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరిని వదిలి

By సుభాష్  Published on  2 Dec 2020 8:56 AM IST
కరోనాతో మరో ఎంపీ కన్నుమూత

కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. రాజకీయ నేతలను వెంటాడుతూనే ఉంది. తాజాగా కరోనాతో ఓ ఎంపీ కన్నుమూశారు. గుజరాత్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అభయ్‌ భరద్వాజ్‌ కరోనాతో కన్నుమూశారు. ఆగస్టులో కరోనా బారిన పడిన ఆయనకు.. రాజ్‌కోటలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిర్‌ అంబులెన్స్‌లో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఇక పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాణాలు వదిలారు. ఎంపీ అభయ్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్‌ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్‌నేత, ఎంపీ అహ్మద్‌పటేల్‌ కరోనాతో నవంబర్‌ 26న మరణించిన విషయం తెలిసిందే. దీంతొ ఒక వారంలో ఇద్దరు ఎంపీలను కోల్పోయింది గుజరాత్‌. రాజ్‌కోటకు చెందిన అభయ్‌ భరద్వాజ్‌ ఈ ఏడాది జూలైలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Next Story