కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన అమ్మే.. ఇలా చేస్తే.. హృద‌యాల‌ను క‌దిలిస్తున్న వీడియో

Mother Beating 3 year old baby Video viral.అభం శుభం తెలియని ఓ మూడేళ్ల చిన్నారిని ఓ త‌ల్లి ఇష్టానుసారంగా కొట్టింది. బిడ్డ‌ను పై నుంచి కింద‌ప‌డేసి..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2021 3:35 AM GMT
Mother Beating 3 year old baby Video viral

త‌ల్లి త‌న బిడ్డ‌ల‌ను ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. తాను తిన్నా త‌నకున్నా త‌న బిడ్డ క‌డుపు నిండితే చాలు అనుకుంటోంది. కార‌ణాలు ఏవైతేనేం కొంద‌రు త‌ల్లులు త‌మ చిన్నారుల ప‌ట్ల ఎంతో దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అమ్మ అనే ప‌దానికి మాయ‌ని మ‌చ్చ‌గా నిలుస్తున్నారు. అభం శుభం తెలియని ఓ మూడేళ్ల చిన్నారిని ఓ త‌ల్లి ఇష్టానుసారంగా కొట్టింది. బిడ్డ‌ను పై నుంచి కింద‌ప‌డేసి.. మెడ‌పై కాలు పెట్టి తొక్కింది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఛత్తీస్‌ఘడ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఏం ఉందంటే..? ఓ మహిళ మూడేళ్ల చిన్నారిని చావబాదుతూ ఉంది. చేతుల‌తో చెంప‌పై, వీపు మీద కొట్టింది. త‌న కోపం చ‌ల్లార‌లేదు అనుకుంటా.. ఆ చిన్నారి ఎత్తుకుని అమాంతం నేల‌పై ప‌డేసింది. ఇలా రెండు మూడు సార్లు చేసింది. మ‌ళ్లీ కొట్టింది. ఆ చిన్నారి మెడ‌పై కాలు పెట్టి తొక్కింది. ఆ చిన్నారి బాధ‌తో విలవిల‌లాడుతున్నా ఆ త‌ల్లి క‌నిక‌రించ‌లేదు. కొడుతూనే ఉంది. ఎంతో మంది అక్క‌డ ఉన్న ఒక్కరు కూడా ఆ మ‌హిళ‌ను ఆప‌డానికి క‌నీసం ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

కొంద‌రు మాత్రం ఎంచ‌క్కా వీడియోలు తీసుకుంటున్నారు. ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో స్ప‌ష్టంగా తెలియ‌కున్నా.. ఆ వీడియో చూసిన ప్ర‌తి ఒక్క‌రు చ‌లించిపోతున్నారు. ఆ మ‌హిళ‌ను శిక్షించాల‌ని కోరుతున్నారు. స‌ద‌రు మ‌హిళ‌ను ఇప్ప‌టికే పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు ఐఏఎస్ అధికారి అవనీష్ తెలిపారు.
Next Story
Share it