మంకీపాక్స్ కలవరం.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
తాజాగా మరో వైరస్ మానవాళిని భయపెడుతోంది. ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా వ్యపించిన మంకీపాక్స్ వైరస్ ఖండాలకు పాకుతోంది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2024 8:40 AM ISTమంకీపాక్స్ కలవరం.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఎంతలా అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. ఎంతోమంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ భయానక పరిస్థితులను తలుచుకుంటేనే ఇప్పటికీ గుండెల్లో గుబులు పుడుతుంది.అయితే.. కరోనా వైరస్ మానవాళిని విడిచిపెట్టలేదు. కొత్త రూపాల్లో వెంటాడుతూనే ఉంది. గతంలో మాదిరిగా ఎఫెక్ట్ లేకపోయినా.. ఎంతోకొంత ప్రభావం చూపుతూనే ఉంది. తాజాగా మరో వైరస్ మానవాళిని భయపెడుతోంది. ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా వ్యపించిన మంకీపాక్స్ వైరస్ ఖండాలకు పాకుతోంది. ఈ వైరస్‌పై ఇప్పటికే అలర్ట్ అయిన డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తాజాగా మంకీపాక్స్ వైరస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరం సమావేశం అయ్యారు. ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలోని అధికారుల బృందంతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంకీపాక్స్‌ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి.. వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించించారు. అయితే.. వరల్డ్ వైడ్‌గా ఇప్పటిదాకా 15,600 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయని అధికారులు ప్రధానికి చెప్పారు. అలాగే 537 మరణాలు ఉన్నాయన్నారు. ఇక దేశంలో మాత్రం భారత్‌లో ఈ ఏడాది ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులతో అన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి కేసులను సత్వరమే గుర్తించేందుకు పర్యవేక్షణ పెంచి, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32 ల్యాబ్‌లను సిద్దంగా ఉన్నాయని, వ్యాధిని అడ్డుకోవడానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అలాగే మంకీపాక్స్ వ్యాధి లక్షణాలను గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు.