మిల్కా సింగ్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Modi has expressed grief over the death of Milkha Singh.క‌రోనా అనంత‌ర స‌మ‌స్య‌ల‌తో స్ప్రింట్ దిగ్గ‌జం మిల్కాసింగ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jun 2021 5:03 AM GMT
మిల్కా సింగ్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి

క‌రోనా అనంత‌ర స‌మ‌స్య‌ల‌తో స్ప్రింట్ దిగ్గ‌జం మిల్కాసింగ్ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మ‌తిపై ప‌లువురు ప్ర‌ముఖులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మిల్కా మృతి ప‌ట్ల రాష్ట్ర‌పతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం తెలిపారు. దిగ్గ‌జ క్రీడాకారుడి మ‌ర‌ణం త‌న హృద‌యాన్ని దుఃఖంతో నింపేసింద‌న్నారు. మిల్కా క‌ష్టాలు, బ‌ల‌మైన వ్య‌క్తిక‌త్వం అనేక త‌రాల‌కు ఆద‌ర్శం అని కొనియాడు.

దేశం గొప్ప క్రీడాకారుడిని కోల్పోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అతని ఉత్తేజకరమైన వ్యక్తిత్వం లక్షలాది మంది భారతీయుల గుండెల్లో స్థానాన్ని సంపాదించిందన్నారు. అతడి మరణం తనకు తీరని లోటని బాధపడ్డారు. అతడితో కలిసి ఉన్న చిత్రాన్ని షేర్ చేసి చేశారు. "కొద్ది రోజుల క్రితం నేను మిల్కా సింగ్ జీతో మాట్లాడాను. ఇది మా చివరి సంభాషణ అని నాకు తెలియదు. చాలా మంది అథ్లెట్లు అతడి జీవిత ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. ఆయన కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులకు నా సంతాపం" అని ట్వీట్ చేశారు.

ప్ర‌పం అథ్లెటిక్స్‌లో మిల్కా చెర‌గ‌ని ముద్ర వేశాడ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొనియాడారు. గొప్ప క్రీడాకారుడి దేశం మిల్కాను స్మ‌రిస్తుంద‌ని తెలిపారు.

Next Story
Share it