ముగిసిన క‌విత ఈడీ విచార‌ణ‌

MLC Kavitha ED Investigation Ended. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొద్దిసేప‌టి క్రితం ముగిసింది.

By Medi Samrat  Published on  11 March 2023 8:36 PM IST
ముగిసిన క‌విత ఈడీ విచార‌ణ‌

MLC Kavitha


ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కొద్దిసేప‌టి క్రితం ముగిసింది. దాదాపు 9 గంటలకు పైగా ఈడీ అధికారులు కవితను విచారించారు. ఉదయం 11 గంటల 9 నిమిషాలకు ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు చేరుకున్న కవిత.. రాత్రి 8 గంటలకు బయటికొచ్చారు. విచార‌ణ అనంత‌రం కవిత తన సొంత వాహనంలో ఈడీ ఆఫీస్‌ నుంచి బయటకు వచ్చారు. దాదాపు 9 గంటలపాటు కవితను ఏం విచారించడంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే.. క‌విత‌ను మరోసారి విచారణకు హాజరుకావాల‌ని ఈడీ అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ నెల 16వ తేదీన కవితను మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత.. తుగ్లక్‌ రోడ్డులోని కేసీఆర్‌ నివాసానికి చేరుకున్నారు.



Next Story