కనిపించకుండా పోయిన సైనికుడు కాస్తా.. శవమై
Missing Budgam soldier found dead, probe on. తన గ్రామం నుండి తప్పిపోయిన మూడు రోజుల తరువాత, సైనికుడు సమీర్ అహ్మద్ మల్లా మృతదేహాన్ని బుద్గామ్‌లోని ఖాగ్
By M.S.R Published on 11 March 2022 10:49 AM ISTతన గ్రామం నుండి తప్పిపోయిన మూడు రోజుల తరువాత, సైనికుడు సమీర్ అహ్మద్ మల్లా మృతదేహాన్ని బుద్గామ్‌లోని ఖాగ్ నుండి గురువారం స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీకి చెందిన సమీర్ అహ్మద్ మల్లా మరో గ్రామానికి వెళ్ళినప్పుడు అతడు కనిపించకుండా పోయాడని, సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉందని పోలీసులు నిర్ధారించారు. సెలవుపై ఇంటికి తిరిగి వచ్చిన సైనికుడు, సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలోని తన గ్రామం నుండి కనిపించకుండా పోయాడు. ఆ ప్రాంతంలోని మిలిటెంట్లు అతడిని అపహరించినట్లు కుటుంబం తెలిపింది. జమ్మూలో పోస్టింగ్‌లో ఉన్న మల్లా తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడంతో సెలవుపై ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులు తప్పిపోయిన మల్లా కోసం ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్లి వెతుకుతున్నారు. అతనిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ వచ్ఛారు. అతను ఏదైనా తప్పు చేసి ఉంటే, దయచేసి అతన్ని క్షమించి విడుదల చేయండి. మేము అతనితో ఉద్యోగానికి రాజీనామా చేయిస్తామని కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగారు. అయితే మల్లాను హతమార్చారు దుండగులు.
అతని శరీరంపై ఎటువంటి తుపాకీ గాయం కనిపించలేదని, అతను ఉగ్రవాదులచే చంపబడ్డాడా..? లేదా..? అని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఖాగ్ ప్రాంతంలోని దల్వాష్‌లోని లాబ్రాన్ గ్రామంలో మల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. "సమీర్ అహ్మద్ మల్లా అనే సైనికుడి మృతదేహం సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో ఖాగ్ బుద్గామ్‌లోని తన గ్రామం లోకిపోరా నుండి కనిపించకుండా తరువాత కనుగొనబడింది" అని పోలీసులు తమ స్టేట్మెంట్ లో తెలిపారు. "ప్రాథమిక విచారణలో, అతని శరీరంపై ఎటువంటి తుపాకీ గాయం కనిపించలేదని తేలింది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని, ఆయన మృతికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని" అధికారులు తెలిపారు.