మోదీ ఓ అహంకారి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్

Meghalaya governor alleges PM Modi was rude.భారత ప్రధాని నరేంద్ర మోదీపై మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్యపాలిక్ మాలిక్

By M.S.R  Published on  3 Jan 2022 2:00 PM IST
మోదీ ఓ అహంకారి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్

భారత ప్రధాని నరేంద్ర మోదీపై మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్యపాలిక్ మాలిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఒక అహంకారి అని వ్యాఖ్యలు చేశారు. మీ బీజేపీ గ‌వ‌ర్న‌రే మిమ్మ‌ల్ని అహంకారి అంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఆయన చేసిన వ్యాఖ్యలను పోస్టు చేసింది.

మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాలిక్ హ‌ర్యానాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. ఇటీవ‌ల రైతుల స‌మ‌స్య‌ల‌పై మాట్లాడేందుకు నేను ప్ర‌ధానిని క‌లిశాను. ఈ సంద‌ర్భంగా కేవ‌లం ఐదు నిమిషాల్లోనే ప్ర‌ధానిలో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. చాలా అహంకారం ప్ర‌ద‌ర్శించారని అన్నారు. మ‌న రైతులు దాదాపు 500 మంది చ‌నిపోయారు అని నేను చెబుతుండగానే వాళ్లు నాకోసం చ‌నిపోయారా అంటూ ప్ర‌ధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారని సత్యపాల్ మాలిక్ అన్నారు.

మీరు రాజు కాబ‌ట్టి రైతుల మ‌ర‌ణాల‌కు మీరే బాధ్యుల‌ని చెప్పాన‌ని తెలిపారు. త‌ర్వాత ప్ర‌ధాని త‌నకు హోంమంత్రి అమిత్‌షాను క‌లిసి మాట్లాడ‌మ‌ని చెప్పార‌ని, ఆయ‌న చెప్పిన‌ట్లే తాను అమిత్ షాను క‌లిశాన‌ని అన్నారు. స‌త్య‌పాల్ మాలిక్ ప్ర‌సంగాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్ట‌ర్‌లో పోస్టుచేసింది. మోదీజీ ఇది నిజ‌మేనా అని ఆ పోస్టుకు క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది.

Next Story