మాయావతిని పీఎం అభ్యర్థిగా ప్రకటించాలి.. ఇండియా కూటమికి కండీషన్
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దాంతో.. ఆయా పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికలపై ఇప్పటికే ఫోకస్ పెట్టాయి.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 12:21 PM GMTమాయావతిని పీఎం అభ్యర్థిగా ప్రకటించాలి.. ఇండియా కూటమికి కండీషన్
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దాంతో.. ఆయా పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికలపై ఇప్పటికే ఫోకస్ పెట్టాయి. ఎవరిని ఎక్కడి నుంచి బరిలోకి దించాలనే దానిపై గ్రౌండ్ రిపోర్టు చేస్తున్నాయి. ఎన్డీఏ సర్కార్‌ను ఎలాగైనా గద్దె దించి.. తాము అధికారంలోకి రావాలని భావిస్తోంది ఇండియా కూటమి. అందులో భాగంగానే విపక్ష పార్టీలన్నింటీని కలుపుకొని ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే సమాజ్ వాదీ పార్టీ ఎంపీ సంచలన డిమాండ్ చేశారు. రాబోయే 2024 పార్లమెంట్ సార్వత్రి ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా బీఎస్పీ చీఫ్ మాయవతిని ప్రకటించాలని అన్నారు.
ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా మాయావతిని ప్రకటించాలని బీఎస్పీ ఎంపీ మాలూక్‌నగర్ డిమాండ్ చేశారు. తాము ఇండియా కూటమిలో చేరాలంటే తమ డిమాండ్‌ను ఓకే చేయాలని అన్నారు. అయితే.. కాంగ్రెస్ కూటమిలో ఇప్పటికే ప్రధాన మంత్రి అభ్యర్థులుగా కొందరు పేర్లను ప్రతిపాదించారు కూటమి నేతలు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ ఎంపీ మాలూక్‌నగర్ డిమాండ్ సంచలనంగా మారింది.
అంతేకాదు.. మాలూక్‌నగర్ మరికొన్ని డిమాండ్లు కూడా ఇండియా కూటమి ముందుంచారు. తమ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో మాయావతికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలన్నారు. ఇలా అయితే ఇండియా కూటమి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోగలదని అన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి ప్రాతినథ్యం వహిస్తున్న వారిలో మాయావతికి ప్రత్యామ్నాయ వ్యక్తి ఎవరూ లేరన్నారు మాలూక్‌నగర్. కాంగ్రెస్ తమ షరతులకు అంగీకరం తెలిపితే మాయావతి సానుకూలంగా ఉంటారని బీఎస్పీ ఎంపీ మాలూక్‌నగర్ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో బీఎస్పీకి 13.5 శాతం ఓట్ షేర్ ఉందనీ.. అది ఇంకా పెరిగే అవకాశాలూ ఉన్నాయన్నారు. మాయావతిని పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే 60 శాతం కంటే ఎక్కువ ఎంపీ సీట్లను బీఎస్పీ గెలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇక బీఎస్పీ, ఎస్పీకి మధ్య విభేదాలపైనా ఎంపీ మాలూక్‌నగర్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని చెప్పారు. ఇండియా కూటమిలో మాయావతి చేరుతానని చెబితే ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఎలాంటి అభ్యంతరం చెప్పరని అన్నారు. మాయావతి పట్ల అఖిలేష్ అసంతృప్తిగా ఉన్నారనేది ఏమాత్రం వాస్తవం కాదని బీఎస్పీ ఎంపీ మాలూక్‌నగర్ అన్నారు.